ఆ డేంజరస్ ఫారెస్ట్ లో మహేశ్ బాబు కష్టాలు.. రాజమౌళి పాన్లింగ్ అదేనా!
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'వారణాసి'(Vasanasi). దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ లెవల్ లో ఉండబోతుంది. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా.. తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకెళ్లేలా.. ప్రపంచం మొత్తం మన సినిమా వైపే చూసేలా వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇలా గ్లోబల్ స్థాయిలో రూపొందుతున్నది. ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కోసం అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు ఓ ఫోటో షేర్ చేశారు. ఇంతకీ ఆ ఫోటో స్పెషల్ లేంటీ?
మహేష్ బాబు - ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా పాన్-వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌పై ప్రతి చిన్న అప్‌డేట్ కూడా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తాజాగా విదేశాలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఫ్యామిలీతో ట్రిప్స్ వెళ్తే ఆయన ఈసారి ఒంటరిగా వెళ్లడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. అయితే తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం ఆయన జర్మనీలోని ప్రసిద్ధి చెందిన బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నారు.

ఈ ప్రాంతంలో మహేష్ బాబు ట్రెక్కింగ్ చేస్తూ, ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా యాక్షన్ మరియు అడ్వెంచర్ సీన్స్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ వెల్నెస్ ట్రై డాక్టర్ హ్యారీ కోనిగ్నర్ పర్యవేక్షణలో ఆయన కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారట. ఈ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి. కొండలు, లోయలు, సరస్సులు, ప్రాంతాలతో ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా ట్రెక్కింగ్‌కు బెస్ట్ లొకేషన్‌గా గుర్తింపు పొందింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా మహేష్ తన పాత్ర కోసం ఎంతగా కష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇది మహేష్ బాబుకు బ్లాక్ ఫారెస్ట్‌లో ట్రైనింగ్ తీసుకోవడం మొదటిసారి కాదు. 2024లో గుంటూరు కారం విడుదల తర్వాత కూడా ఆయన ఇక్కడ ట్రెక్కింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే కనిపించడం 'వారణాసి' కోసం స్పెషల్ ప్రిపరేషన్ అని స్పష్టమవుతోంది.
సినిమా కథ విషయానికి వస్తే.. ఇది ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్-అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందించబడినట్లు సమాచారం. కథ పలు దేశాల్లో సాగుతుందని, ఆఫ్రికా అడవుల నుంచి అంటార్కిటికా వరకు షూటింగ్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలో ఉండొచ్చనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఈ పాన్ ఇండియా సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను స్పానిష్ పలు భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత S. S. కార్తికేయ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులు, గ్లోబల్ స్టోరీలైన్‌తో ఈ సినిమా తెలుగు సినిమాకు మరో కొత్త స్థాయిని తీసుకొచ్చేందుకు అంచనాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా మహేష్ బాబు బ్లాక్ ఫారెస్ట్‌లో చేస్తున్న హార్డ్ ట్రైనింగ్, S. S. రాజమౌళి విజన్-అన్నీ కలిసి 'వారణాసి' సినిమా ఒక గ్లోబల్ సినీ ఈవెంట్‌గా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. అభిమానులు ఈ సినిమా కోసం మరింత ఆత్రుతగా ఉన్నారు.


Click it and Unblock the Notifications