ఫ్యాన్స్‌కు పండుగే: ఆ సినిమాలో మహేశ్ ట్రిపుల్ రోల్.. మిస్టరీ లుక్స్‌తో సూపర్ స్టార్

By Manoj Kumar P

కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవా చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరో అయిపోయాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్‌లను సాధించినప్పటికీ... భారీ డిజాస్టర్లను కూడా చవి చూశాడు. అయితే, జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తుండడం అతడికి కలిసొచ్చిందనే చెప్పాలి. ఇదిలాఉండగా, మహేశ్ బాబు తొలిసారి ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని తాజాగా ఓ వార్త లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

దూకుడు చూపిస్తున్న మహేశ్.. హ్యాట్రిక్ సొంతం

దూకుడు చూపిస్తున్న మహేశ్.. హ్యాట్రిక్ సొంతం

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ మధ్య ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. గత సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు'తో మరో విజయాన్ని అందుకున్నాడు. ఫలితంగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశాడు. దీంతో అతడు తన మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకుంటున్నాడు.

గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది.. మహేశ్ పరిస్థితి ఇది

గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది.. మహేశ్ పరిస్థితి ఇది

‘సరిలేరు నీకెవ్వరు' విజయంతో మాంచి దూకుడు మీద ఉన్నాడు మహేశ్ బాబు. ఈ సినిమా విడుదలై ఐదు నెలలు గడుస్తున్నా.. తన తదుపరి సినిమాకు సంబంధించిన ప్రకటనను మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. వాస్తవానికి అతడి సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావంతో అది కాస్తా ఆలస్యం అయిపోతోంది.

ఒకరికి హ్యాండిచ్చాడు.. ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చాడు

ఒకరికి హ్యాండిచ్చాడు.. ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చాడు

వాస్తవానికి ‘సరిలేరు నీకెవ్వరు' విడుదల కాకముందే మహేశ్ తన తదుపరి సినిమా వంశీ పైడిపల్లితో ఉంటుందని పరోక్షంగా వెల్లడించాడు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. స్క్రిప్ట్‌కు సంబంధించిన కారణాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న టాక్ ఉంది. వంశీ సినిమా ఆగిపోవడంతో.. మహేశ్ బాబు.. పరశురాంకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.

మహేశ్ - పరశురాం సినిమా కథ లీక్ అయింది

మహేశ్ - పరశురాం సినిమా కథ లీక్ అయింది

పరశురాంతో మహేశ్ చేయబోయే సినిమా కథ లీకైనట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దాని ప్రకారం.. మహేశ్ బాబు తల్లి ఓ బ్యాంక్‌లో ఉద్యోగి. ఆమె సంతకాలు ఫోర్జరీ చేసి ఓ బిజినెస్‌మ్యాన్ బ్యాంక్ నుంచి భారీ మొత్తం లోన్‌గా తీసుకుని ఫారెన్ పారిపోతాడు. అతడిని దేశానికి రప్పించి, తన తల్లి నిజాయితీ నిరూపించేందుకు హీరో చేసే ప్రయత్నాలే సినిమా కథ అని సమాచారం.

కథకు అనుగుణంగానే టైటిల్ ఫిక్స్ చేశారు

కథకు అనుగుణంగానే టైటిల్ ఫిక్స్ చేశారు

కొద్ది రోజులుగా ప్రచారం అవుతోన్న ఈ సినిమా కథకు అనుగుణంగానే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇటీవల ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హల్‌చల్ చేసింది. దీని ప్రకారం... మహేశ్ కొత్త సినిమాకు ‘సర్కారి వారి పాట' అనే టైటిల్ ఫైనల్ చేశారని అంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

Recommended Video

Karthika Deepam fame Nirupam AKA Karthik Got gift from Chiranjeevi's Mother Anjana Devi
ఆ సినిమాలో మహేశ్ బాబు ట్రిపుల్ రోల్

ఆ సినిమాలో మహేశ్ బాబు ట్రిపుల్ రోల్

తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం... ఇందులో మహేశ్ బాబు మూడు డిఫరెంట్ లుక్స్‌తో కనిపించబోతున్నాడట. అందులో ఒకటి టీనేజ్ అబ్బాయిగా, రెండోది కాలేజ్ కుర్రాడిగా, మూడోది మధ్య వయస్కుడిగా ఉంటుందని అంటున్నారు. ఈ మూడు పాత్రల వెనుక మిస్టరీ ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X