Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మొత్తానికి డేట్ ఫిక్స్ చేసుకున్న త్రివిక్రమ్.. ఆసలు క్లారిటీ వచ్చేది ఆ రోజే
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో మొదటిసారి ఊహించని అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఒక సినిమా ఆల్ మోస్ట్ స్టార్ట్ అయ్యిందని అనుకున్న సమయానికి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివకు షిఫ్ట్ అవ్వడంతో ఇప్పుడు ఆయన మరొక హీరోను వెతుక్కోవాల్సి వచ్చింది.
అసలు మ్యాటర్ లోకి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. అసలైతే ఎన్టీఆర్ అప్డేట్ ఇచ్చిన మరుసటి రోజే అప్డేట్ ఇవ్వాలని అనుకున్నారట. కానీ ఆ విదంగా చేస్తే కౌంటర్ ఇచ్చినట్లు ఉంటుందని గ్యాప్ మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ తో ఎప్పటి నుంచో మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.
అసలు కథ సిద్ధమయ్యిందట. కానీ ఫుల్ స్క్రిప్ట్ పనులు ఫినిష్ అవ్వలేదని సమాచారం. ఇక మహేష్ కూడా తొందర పడటానికి ఇష్ట పడటం లేదు గాని త్రివిక్రమ్ మీద నమ్మకంతో అఫిషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాను అఫీషియల్ గా మే 31న లాంచ్ చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఎందుకంటే అప్పటి వరకు మహేష్ బాబు సర్కారు వారి పాట కీలక షెడ్యూల్ ముగుస్తుంది. కొంత త్రివిక్రమ్ సినిమాపై ఫోకస్ పెట్టె అవకాశం కూడా దొరుకుతుంది. అందుకే ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.