మహేష్, త్రివిక్రమ్ కాన్సెప్ట్ ఇదే.. మళ్ళీ అదే ఫార్ములా.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్!
స్టార్ దర్శకులతో అగ్ర హీరోలు సినిమాలు చేస్తే ఆ బజ్ మాములుగా ఉండదు. స్టార్ హీరో మహేష్ బాబు కూడా ఇంకా చాలా మంది అగ్ర దర్శకులతో వర్క్ చేయాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు గాని ఆల్ మోస్ట్ కాంబో సెట్టయినట్లు టాక్ వస్తోంది. ఇక వీరి కాంబోపై వస్తున్న గాసిప్స్ పై అభిమానుల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది.
ఎద అందాలు ప్రదర్శిస్తున్న సాక్షి అగర్వాల్.. ప్యాంట్ వేసుకోకుండా అందాల ఆరబోత

ఆ రెండు సినిమాలు
మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇదివరకే రెండు సినిమాలు వచ్చాయి. అతడు సినిమాతో ఈ ఇద్దరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఆ సినిమా ఇప్పుడు విడుదలై ఉంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసి ఉండేది. ఇక మహేష్ బాబును కామెడీ యాంగిల్ లో ప్రజెంట్ చేస్తూ చేసిన ఖలేజా సినిమా కూడా ఓ వర్గం ఆడియెన్స్ కు ఇప్పటికి నచ్చుతుంది.

ఎలాంటి కథ?
రెండు సార్లు కలిసి వర్క్ చేసిన ఈ స్పెషల్ కాంబో బాక్సాఫీస్ వద్ద సంతృప్తిగా సక్సెస్ అందుకోలేదు. ఇక ఎలాగైనా మూడవసారి పవర్ఫుల్ హిట్టు కొట్టాలని చూస్తున్నారు. కానీ త్రివిక్రమ్ సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు త్రివిక్రమ్ అగ్ర హీరోలతో చేసిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ కథలే.

మహేష్ బాబుతో చేయబోయే కథ
అత్తారింటికి దారేది, అరవింద సమేత, అల.. వైకుంఠపురములో.. ఇలా అన్ని సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ను హై లెవెల్లో చూపించాడు. ఇక మహేష్ బాబుతో చేయబోయే సినిమా కూడా దాదాపు అదే తరహాలో ఉంటుందని టాక్ వస్తోంది. ఇదివరకు ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్న కథ కూడా దాదాపు అలాంటిదేనట.
Recommended Video

ఫ్యాన్స్ కు నచ్చడం లేదు
అయితే త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో మహేష్ తో ఫ్యామిలీ తరహా సినిమా చేయడం అభిమానులకు అంతగా నచ్చడం లేదు. త్రివిక్రమ్ మళ్ళీ రెగ్యులర్ కాన్సెప్ట్ లోనే వెళ్లడం ఏ మాత్రం బాగోలేదని ఆందోళన చెందుతున్నారు. త్రివిక్రమ్ అనుకుంటే మంచి యాక్షన్ కథలను తెరకెక్కించవచ్చని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరి ప్రాజెక్ట్ పై త్వరలోనే అఫీషియల్ గా ఒక క్లారిటీ రానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











