For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫ్యాన్సే కాదు.. స్టార్స్ మెచ్చిన స్టార్: మహేష్ గురించి టాలీవుడ్ మాట ఇదీ..

  |

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు నేడు పండగ రోజు. నేటితో ఆయన 44వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, సినీతారలు కూడా మెచ్చిన నటుడు మహేష్ బాబు. వివాద రహితుడిగా, మంచి వ్యక్తిత్వం ఉన్న, మంచి మనసున్న స్టార్‌గా ఆయన ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ చేశారు. సమాజహితం కోరే సినిమాలు చేస్తూ, పలు అంశాల్లో సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ మార్పులో తాను భాగం అవుతూ, అభిమానులను, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన గురించి గతంలో పలు సందర్భాల్లో సినీ ప్రముఖులు చెప్పిన మాటలు ఓ సారి గుర్తు చేసుకుందాం.

  మా ఇంట్లో మహేష్ బాబును అంతా బాగా లైక్ చేస్తాం: చిరంజీవి

  మా ఇంట్లో మహేష్ బాబును అంతా బాగా లైక్ చేస్తాం: చిరంజీవి

  మా ఇంట్లో మహేష్ బాబును అంతా బాగా లైక్ చేస్తాం. మహేష్ సినిమాలు వరుసగా చూస్తుంటాం.... అని గతంలో ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ రెండు ఫ్యామిలీ మధ్య మంచి రిలేషన్ ఉంది. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్-మహేష్ బాబు తరచూ కలుస్తున్న సంగతి తెలిసిందే.

  మహేష్ ఏ విషయమైనా చాలా ఓపెన్‌గా మాట్లాడతారు: నాగార్జున

  మహేష్ ఏ విషయమైనా చాలా ఓపెన్‌గా మాట్లాడతారు: నాగార్జున

  ఊరిపి సినిమా సమయంలో... మహేష్ బాబు నాకు ఫోన్ చేసి 20 నిమిషాలు మాట్లాడారు. వాట్ ఈజ్ దిస్ నాగ్.. ఫెంటాస్టిక్ అన్నాడు. ఇంకొన్ని మాటలు తెలుగులో ఓపెన్ గా చెప్పాడు. అవి మీ ముందు చెప్పలేను. మహేష్ ఏ విషయమైనా చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. ‘ఇక మేమేం చూపించాలి అన్నాడు'... ఆయన ఏ మన్నాడో మీరే అర్థం చేసుకోండి అంటూ నాగ్ వ్యాఖ్యానించారు.

   నేను ఆయన్ను మహేష్ అన్న అంటాను: జూ ఎన్టీఆర్

  నేను ఆయన్ను మహేష్ అన్న అంటాను: జూ ఎన్టీఆర్

  భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ... మీరందరూ ఆయన్ను ప్రిన్స్ అంటారు. సూపర్ స్టార్ అంటారు. నేను ఆయన్ను మహేష్ అన్న అంటాను. ఈ రోజు మహేష్ అన్న ఆడియో ఫంక్షన్‌కు నన్ను ముఖ్య అతిథి అంటున్నారు. నేనే ముఖ్య అతిథిగా రాలేదు. నేనొక కుటుంబ సభ్యుడిగా వచ్చాను.

  మహేష్ బాబు చాలా అందగాడు: రామ్ చరణ్

  మహేష్ బాబు చాలా అందగాడు: రామ్ చరణ్

  అందరూ మహేష్ బాబును అందగాడు అంటారు. ఆయనకున్న అందం కాస్త మాకు కూడా ఉంటే బావుంటుంది అనిపిస్తుంది.... అని రామ్ చరణ్ గతంలో ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.

  అది ఎవరికీ కనిపించదు: సమంత

  అది ఎవరికీ కనిపించదు: సమంత

  మహేష్ బాబు గురించి అందరికీ తెలియని విషయం... ఆయనకు సెన్సాఫ్ హ్యూమర్ 100 రెట్లు ఉంటుంది. అది ఎవరికీ కనిపించదు. ఆయనకు చాలా దగ్గరయితే ఆయన మన వద్ద ఆ సైడ్ ఓపెన్ చేస్తారు.... అని సమంత ఓ సందర్భంలో తెలిపారు..

  మహేష్‌ ఒక అడిక్షన్: పూరి జగన్నాథ్

  మహేష్‌ ఒక అడిక్షన్: పూరి జగన్నాథ్

  మహేష్‌తో పని చేయడం మత్తు లాంటిది. మహేష్‌తో పని చేయడం ఎడిక్షన్. అనుక్షణం డైరెక్టర్‌కు కిక్ ఇచ్చే యాక్టర్ మహేష్. మనం ఒకటి అనుకుంటే దానికి పదింతలు చేస్తారు. ప్రతి రోజూ ఇంటికెళ్లి హ్యాపీగా నిద్రపోవచ్చు. అంతగా సంతృప్తినిస్తాడని... పూరి గతంలో ఓ సందర్భంలో తెలిపారు.

  ఇప్పుడున్న ట్రెండులో మీనింగ్ ఫుల్ సినిమాలు చేస్తున్న స్టార్: త్రివిక్రమ్

  ఇప్పుడున్న ట్రెండులో మీనింగ్ ఫుల్ సినిమాలు చేస్తున్న స్టార్: త్రివిక్రమ్

  నేను, మహేష్ బాబు ఎక్కువగా మాట్లాడుకునేది ఏమిటంటే.. మీనింగ్‌ఫుల్‌గా ఉంటూ మనం కమర్షియల్‌ సక్సెస్ ఎందుకు సాధించలేం. ఇప్పుడున్న ట్రెండులో మీనింగ్ ఫుల్ సినిమాలు చేసే స్టార్లు అతి కొద్ది మంది ఉన్న టైమ్‌లో మీనింగ్ ఫుల్ సినిమా బాగా అర్థం చేసుకుని చేసే స్టార్ మహేష్ బాబు.... అన్నారు త్రివిక్రమ్

  ఎటకారం ఎక్కువ: సునీల్

  ఎటకారం ఎక్కువ: సునీల్

  మహేష్ బాబు గారు ఆయన ఫ్యామిలీ, టీమ్ విషయంలో వెరీ మచ్ లాయల్ గా ఉంటారు. చాలా క్లీన్ మనిషి. మీరందరూ ఊహించినదానికంటే మహేష్ బాబుగారికి ఎటకారం ఎక్కువ. ఆ విషయంలో నేను కూడా సరిపోను... అని సునీల్ గతంలో ఓసారి వ్యాఖ్యానించారు.

  English summary
  The Favorite actor of Tollywood Stars, Mahesh Babu turns 44 today. Mahesh Babu started his career as a child actor in Needa in 1979 when he was 4 years old. He is the younger son of Telugu actor Krishna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X