రోమాలు నిక్కబొడిచాయి: ఎన్టీఆర్ ట్రైలర్‌పై మహేష్ బాబు
ప్రముఖ నటుడు, తెలుగునాట వెండితెర వేల్పు ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్, ఆడియో రిలీజ్ వేడుక వైభవంగా నిర్వహించారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు... సూపర్ స్టార్లు సైతం ఈ చిత్రం ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్-కథానాయకుడు ట్రైలర్ చూసిన తర్వాత మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

బాలకృష్ణ పరకాయ ప్రవేశం చేశారు
‘‘ఎన్టీఆర్ కథానాయకుడు ట్రైలర్ అద్భుతంగా ఉంది. అది చూస్తున్నంతసేపు రొమాలు నిక్కబొడిచాయి. ఎన్టీ రామారావుగారి పాత్రలోకి బాలకృష్ణగారు పరకాయ ప్రవేశం చేసినట్లు ఉంది'' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

బాగా నచ్చేసింది, వెయిట్ చేస్తున్నా
ఇతర పాత్రల్లో నటించిన వారు సైతం బాగా చేశారు. ట్రైలర్ నాకు బాగా నచ్చింది. సినిమా ఎప్పుడు వస్తుందా అని మీ అందరిలాగే నేనూ ఎదురు చూస్తున్నాను.... అని మహేష్ బాబు తన మనసులోని మాటను బయట పెట్టారు.

మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా...
మహేష్ బాబు ట్వీట్ ‘ఎన్టీఆర్ బయోపిక'కు మరింత ప్రచారం కల్పించింది. మహేష్ అభిమానులు సైతం సినిమాకు తమ మద్దతు ప్రకటిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ బయోపిక్ చుట్టూ క్రియేట్ అయిన బజ్ చూస్తుంటే సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్టీఆర్ బయోపిక్
క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ చిత్ర నిర్మాణంలో బాలకృష్ణ కూడా భాగం అయ్యారు. వారాహి చలన చిత్రం సమర్పణలో విడుదల కాబోతోంది. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. మొదటి భాగం ‘కథానాయకుడు' జనవరి 9న, రెండో భాగం ‘మహానాయకుడు' ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











