For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బొమ్మ అదిరిపోయింది: మహేష్ బాబు, టాప్ డైరెక్టర్స్ రివ్యూ..

    |

    రజనీకాంత్ నటించిన 'పేట' చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ సూపర్ స్టార్ మూవీపై ప్రశంసలు గుప్పించారు.

    పలువురు టాప్ సెలబ్రిటీలు సైతం తలైవా మూవీపై స్పందించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్, వెంకట్ ప్రభు, రాఘవ లారెన్స్ లాంటి ప్రముఖులు 'పేట' సినిమా అదిరిపోయిందంటూ ట్వీట్స్ చేశారు.

    అభిమానులకు ఒక బహుబతి: మహేష్ బాబు

    అభిమానులకు ఒక బహుబతి: మహేష్ బాబు

    ‘పేట' చిత్రం నాతో పాటు అభిమానులందరికీ ఒక బహుమతి లాంటిది. ఓన్లీ వన్ వర్డ్ ‘తలైవా', కార్తిక్ సుబ్బరాజ్ టాలెంట్ ఉన్న డైరెక్టర్. తిరు డిఓపీ ఎప్పుడూ ఔట్ స్టాండింగ్‌గా ఉంటుంది. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

    మాస్టర్ ఆఫ్ మాస్: ఏఆర్ మురుగదాస్

    మాస్టర్ ఆఫ్ మాస్: ఏఆర్ మురుగదాస్

    ‘పేట' సూపర్ మాస్ మూవీ. సూపర్ స్టార్ రజనీ సర్ ఎనర్జీ అద్భుతం. ఆయన మాస్టర్ ఆఫ్ మాస్. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు కంగ్రాట్స్ అంటూ ఏఆర్ మురుగదాస్ ట్వీట్ చేశారు.

    చాలా ఎంజాయ్ చేశాను: రాఘవ లారెన్స్

    చాలా రోజుల తర్వాత ఫుల్ తలైవా స్టైల్ సినిమా చూశాను. సినిమాను చాలా ఎంజాయ్ చేశాను. అరిచి అరిచి నా గొంతు దెబ్బతింది. తలైవా ఫ్యాన్స్ అందరూ ఇలాంటి అనుభవమే పొందారని అనుకుంటున్నాను. విజయ్ సేతుపతి ఎక్సలెంట్. ఇలాంటి సినిమా అందించిన కార్తీక్ సుబ్బరాజుకు థాంక్స్ అంటూ రాఘవ లారెన్స్ ట్వీట్ చేశారు.

    ఎపిక్ ఫిల్మ్: ధనుష్

    ఎపిక్ ఫిల్మ్: ధనుష్

    ‘పేటా' ఎపిక్ ఫిల్మ్. నాకు సనిమా ఎంతో నచ్చింది. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. ఇలాంటి సినిమా అందించిన కార్తీక్ సుబ్బరాజుకు థాంక్స్. అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది... అని ధనుష్ ట్వీట్ చేశారు.

    మాస్ ఫార్మాట్లో ఫ్యామిలీ ఎంటర్టెనర్

    మాస్ కమర్షియల్ ఫార్మాట్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టెనర్ ‘పేట'. నేను ఎప్పటికీ తలైవా అభిమానినే అంటూ.... వెంకట్ ప్రభు ట్వీట్ చేశారు.

    English summary
    "Petta is a tribute to all the fans of rajinikanth sir, including me... Only one word... Thalaiva...🙏 karthiksubbaraj you are one of the finest talents we have 👍 DOP_Tirru outstanding as always 👌 Congrats to the entire team." Mahesh Babu tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X