మహేష్ బాబు ట్వీట్‌పై... టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫ్యాన్స్ ఫైర్!

Recommended Video

Harish Rao Fans Fires On Mahesh Babu Tweet || Filmibeat Telugu

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదలు పెట్టిన అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేసి శుక్రవారం(జూన్ 21) జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్లు నాగార్జున, రవితేజ ట్వీట్ చేస్తూ... దీన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొన్నారు. కేటీఆర్, తెలంగాణ సీఎంఓకు అభినందనలు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డ హరీష్ రావును అభినందించకుండా కేటీఆర్‌ను అభినందించడంపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మహేష్ బాబుకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

హాట్సాఫ్ ఇంజనీర్స్ అంటూ... మహేష్ బాబు ట్వీట్

‘‘తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించారు. దీని రూపకల్పన వెనక ఉన్న ఇంజనీర్లకు హాట్సాఫ్. ఇదొక విప్లవాత్మక, ఆదర్శవంతమైన ప్రాజెక్ట్. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంఓ, కేటీఆర్‌కు కంగ్రాట్స్'' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

మహేష్ బాబు ఎందుకు ఇలా?

మహేష్ బాబు ఎందుకు ఇలా?

పార్టీ పర్సన్ అయిన కేటీఆర్‌కు మహేష్ బాబు ఎందుకు అభినందనలు తెలుపుతున్నారో అర్థం కావడం లేదు. మీరు అభినందించాల్సింది హరీష్ రావును... కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కావడం వెనక హరీష్ రావు కష్టం ఎంతో ఉంది. 2014 నుంచి 2019కు ఆయన ఇరిగేషన్ మినిస్టర్‌గా పని చేశారంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఒక అభిమానిగా మీ ట్వీట్ చూసి డిసప్పాయింట్ అయ్యా..

ఒక అభిమానిగా మీ ట్వీట్ చూసి డిసప్పాయింట్ అయ్యా..

‘‘ఒక అభిమానిగా మీరు చేసిన ట్వీట్ చూసి డిసప్పాయింట్ అయ్యా అన్నా... ఈ ప్రాజెక్ట్ కోసం రాత్రింభవళ్లు కష్టపడిన హరీష్ రావు గురించి పట్టించుకోకపోవడం బాధగా ఉంది. ఆయన పడిన శ్రమకు క్రెడిట్ దక్కకుండా చేస్తున్నారు'' అంటూ మరొకరు స్పందించారు.

మన సెలబ్రిటీలకు ఏమీ తెలియదు

మన సెలబ్రిటీలకు ఏమీ తెలియదు

మన సినీ సెలబ్రిటీలకు ఏమీ తెలియిదు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై వారికి పెద్దగా అవగాహన ఉండదు. నాకు కేటీఆర్ సర్ మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ క్రెడిట్ దక్కాల్సింది హరీష్ రావు, కేసీఆర్, విద్యాసాగర్ రావులకే... ఈ ప్రాజెక్ట్ వెనక వారి కృషి ఎంతో ఉంది...అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X