twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తండ్రి ఆయనకు, కొడుకు ఈయనకు: టీఆర్ఎస్ విజయంపై మహేష్ బాబు బిగ్ ట్వీట్!

    |

    తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించి సంబరాలు జరుపుకుంటున్న వేళ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతూ బిగ్ ట్వీట్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తనకు అత్యంత సన్నిహితుడు కేటీఆర్‌కు కంగ్రాట్స్ తెలిపారు.

    ఇప్పటికే మహేష్ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను అభినందిస్తూ ప్రకటన విడుదల చేయగా.... ఇపుడు మహేష్ బాబు కేసీఆర్ తనయుడు కేటీఆర్‌కు కంగ్రాట్స్ తెలియజేయడం గమనార్హం.

    బిగ్ కంగ్రాట్స్ అంటూ...

    బిగ్ కంగ్రాట్స్ అంటూ...

    ఎన్నికల్లో విజయం సాధించిన కేటీఆర్‌కు అభినందనలు. ఈ విజయానికి ఆయన పూర్తిగా అర్హులు. ప్రజల మనిషిగా ఆయన మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

    గతంలో మహేష్ బాబుపై కేటీఆర్ అభినందనలు

    గతంలో మహేష్ బాబుపై కేటీఆర్ అభినందనలు

    టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేష్‌బాబు అనేకమంది యువతకు స్ఫూర్తి అని కేటీఆర్‌ గతంలో ‘భరత్ అనే నేను' సినిమా విడుదల సమయంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

    ఎంత క్లోజ్ రిలేషన్ అంటే...

    ఎంత క్లోజ్ రిలేషన్ అంటే...

    మహేష్ బాబు, కేటీఆర్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. గతంలో భరత్ అనే నేను సినిమా సమయంలో ఇద్దరూ కలసి విజన్ ఫర్ బెటర్ టుమారో అనే ఓ కార్యక్రమం నిర్వహించారు. అపుడు మహేష్‌బాబు మాట్లాడుతూ ‘మా సినిమా చూసిన కేటీఆర్‌ సర్‌కు ధన్యవాదాలు అని వ్యాఖ్యానించగా... మధ్యలో కేటీఆర్‌ కల్పించుకు జస్ట్‌ రామ్‌ అని పిలవండి అంటూ చెప్పడం ఆ సమయంలో హాట్ టాపిక్ అయింది.

    మహేష్ బాబుతో ఎలాంటి విషయాలైనా నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తి కేటీఆర్

    మహేష్ బాబుతో ఎలాంటి విషయాలైనా నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తి కేటీఆర్

    కేటీఆర్ ఎప్పుడు నా సినిమాలు చూసినా నాకు టెన్షన్‌. బాగుంటే బాగుందని చెప్తారు. లేకపోతే చెప్పరు. నాకు బాగా గుర్తు ‘ఆగడు' చూసి ‘స్టాప్‌ డూయింగ్‌ నాన్సెన్స్‌ లైక్‌ దిస్‌' అన్నారు. అంత నిజాయతీగా ఉంటారు' అని అప్పట్లో మహేష్ బాబు గుర్తు చేసుకున్నారు.

    English summary
    "A big congratulations on the win KTRTRS... A very well deserved one. Continue to be the man of the people... Wishing you all the very best." Mahesh Babu tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X