కాజీకోడ్ దుర్ఘటనపై మహేశ్ సంతాపం... ట్విట్టర్ ద్వారా మృతులకు అశృనివాళి
ఈ ఏడాది మొత్తం అత్యంత విషాదకర సంఘటనలతోనే గడిచిపోతోంది అనడానికి కేరళలో చోటుచేసుకున్న ఎయిర్ క్రాష్ తాజా ఉదాహరణగా నిలిచింది. కాజీకోడ్ ఎయిర్ పోర్ట్ లో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోగా, మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై సినీ పరిశ్రమ సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా మృతులకు సంతాపం తెలియజేశారు.

విమాన దుర్ఘటనలో సీనియర్ పైలెట్ మృతి చెందగా, పలువురు ప్రయాణీకులు సైతం ప్రాణాలు కోల్పోయారు. వందే భారత్ మిషిన్ లో భాగంగా దుబాయ్ నుంచి కాజీకోడ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విమానం సాంకేతిక సమస్యలతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘుటనపై స్పందించిన మహేశ్ బాబు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని ట్వీట్ చేశాడు. ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తూనే, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశాడు. ఈ దురదృష్టకర ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరాడు.


Click it and Unblock the Notifications











