8 ఏళ్ల తరువాత మహేష్ సర్‌‌ప్రైజ్.. అభిమానులకు ఇక పండగే, సిద్ధంగా ఉన్నారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా ఏ మాత్రం ఫ్లాప్ అవ్వకూడదని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడున్న స్టార్ హీరోలలో రిజల్ట్ తరువాత కూడా ఎక్కువగా ఆలోచించే వారిలో మహేష్ ఒకరు. సినిమా ఫ్లాప్ అయితే చాలా మంది పై ప్రభావం పడుతుందని ఈ స్టార్ కథల విషయంలో ఎంతో సీరియస్ గా ఉంటాడు. ఇక చాలా ఏళ్లకు మహేష్ అభిమానులకు ఒక సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు.

కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి..

కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి..

మహేష్ బాబు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నెమ్మదిగానే సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఒకప్పుడు తండ్రి కృష్ణ ఏడాదికి 8కి పైగా సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మహేష్ అంత వేగంగా వెళ్లే ఛాన్స్ లేదు. మహేష్ హీరోగా మారిన తరువాత ఒక ఏడాదిలో రెండు సినిమాలు రావడమే ఎక్కువ.

ఆ సినిమాతో ఎక్కువ గ్యాప్

ఆ సినిమాతో ఎక్కువ గ్యాప్

మహేష్ బాబుకు హీరోగా స్టార్ ఇమేజ్ రావడానికి సమయం చాలానే పట్టింది. ఒక్కడు సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన తరువాత మళ్ళీ పోకిరి సినిమాతో మరొక రికార్డును క్రియేట్ చేశాడు. వరుసగా ఏడాదికొక సినిమా చేసుకుంటూ వస్తున్న తరుణంలో ఖలేజా అనంతరం కాస్త ఎక్కువ గ్యాప్ వచ్చింది.

2014 రెండు సినిమాలు

2014 రెండు సినిమాలు

ఆ గ్యాప్ మళ్ళీ రాకూడదు అని మినిమమ్ ఏడాదికొక సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. మహేష్ చివరగా రెండు సినిమాలు రిలీజ్ చేసింది 2014లోనే. సుకుమార్ దర్శకత్వంలో చేసిన 1 నేనొక్కడినే, అలాగే ఆగడు సినిమాలు వెంటవెంటనే వచ్చాయి. ఆ సినిమాలు డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

Recommended Video

SSMB 28 : Mahesh Babu, Trivikram నుంచి 11 ఏళ్ల తర్వాత.. హీరోయిన్ ఆమెనా? || Filmibeat Telugu
8 ఏళ్ళ తరువాత..

8 ఏళ్ళ తరువాత..

ఇక 2020 మొదట్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టిన మహేష్ వెంటనే మరో సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నడు కానీ కరోనా దెబ్బ వల్ల కుదరలేదు. ఇక 2021 అనుకోకుండా మిస్సవుతుండడంతో ఇప్పుడు 2022లో మాత్రం ఎలాగైనా రెండు సినిమాలతో రావాలని ఫిక్స్ అయ్యాడు. సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమాలను వచ్చే ఏడాది పెద్దగా గ్యాప్ లేకుండా విడుదల చేయబోతున్నాడు. మరి ఆ సినిమాలు అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X