మహేష్ బాబుకి సర్జరీ.. రెండు నెలల పాటు బెడ్ రెస్ట్.. అసలు ఏమైంది? ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే?

సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. గీత గోవిందం దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఈ సినిమా షూట్ కి బ్రేక్ ఇచ్చిన మహేష్ బాబుకు సర్జరీ జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే

 సినిమా మొదలు కాకముందే

సినిమా మొదలు కాకముందే

ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా సర్కారు వారి పాట సినిమా వాయిదా పడింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మొదలు కాకముందే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ సినిమాలో మహేష్ ప్రీ లుక్ సినిమా మీద అంచనాలు పెంచింది.

 బ్యాంకింగ్ ఫ్రాడ్స్

బ్యాంకింగ్ ఫ్రాడ్స్

మహేష్ మెడ మీద రూపాయి గుర్తుతో ఉన్న టాటూ, మహేష్ జూలపాల లుక్ సినిమా మీద ఆసక్తి పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆ తర్వాత సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ చాలా తక్కువే కానీ వచ్చిన అన్ని సినిమా మీద ఆసక్తి పెంచాయి. ఈ సినిమా భారతదేశంలో జరిగిన బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కు సంబంధించిన కథ నేపథ్యంలో ఉండనుందని అంటున్నారు. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా మహేష్ తో కీర్తి సురేష్ కలిసి నటిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం స్పెయిన్లో

కొద్ది రోజుల క్రితం స్పెయిన్లో

మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా 2022 ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు మహేష్ బాబు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితం స్పెయిన్లో జరిగింది..స్పెయిన్ లో షూటింగ్ పూర్తి కావడంతో యూనిట్ అంతా మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకుంది. అయితే తాజా సమాచారం మేరకు మహేష్ బాబు మోకాలికి సర్జరీ జరిగింది.

స్పెయిన్ దేశంలో సర్జరీ

స్పెయిన్ దేశంలో సర్జరీ

మహేష్ మోకాలికి స్పెయిన్ దేశంలో సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ఆయన దుబాయ్ లో నమ్రత సోదరి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని అంటున్నారు. మహేష్ భార్య నమ్రత సిస్టర్ శిల్పా శిరోద్కర్ దుబాయ్ లో నివాసం ఉంటున్నారు. అక్కడే కొన్ని రోజులు మహేష్ విశ్రాంతి తీసుకోనున్నట్లు చెబుతున్నారు.కాగా, మహేశ్‌బాబుకి గతంలో కూడా మోకాలి గాయంతో బాధపడ్డారు. 2014 నుంచి ఆయన ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అప్పటి నుంచి సర్జరీ చేయించు కోక పోవడం వల్ల ఆ బాధ మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది.

 వైద్యుల సలహా మేరకే

వైద్యుల సలహా మేరకే

ఈ క్రమంలో వైద్యుల సలహా మేరకే ఆయన స్పెయిన్‌ వెళ్లి సర్జరీ చేయించుకున్నారు. ఇక మహేశ్‌ సర్జరీ చేయించుకున్నారనే వార్త విన్న అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సర్కారు వారి పాట సినిమా విడుదల వాయిదా పడటం వెనుక కూడా మహేష్ సర్జరీ అని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X