అదే స్పీడ్.. మరో సంక్రాంతిని టార్గెట్ చేసిన మహేష్!
సూపర్ స్టార్ మహేష్ బాబు మరొకసారి ఫెస్టివల్ ని టార్గెట్ చేస్తూ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సంక్రాంతికి సరిలేరు నికేవ్వరు అంటూ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ నెక్స్ట్ కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో కొత్త సినిమాకి సంబంధించిన చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.
దర్శకుడు మరో సినిమాతో బిజిగా ఉన్నప్పటికీ తన వైపుకు లాగేసుకున్న సూపర్ స్టార్ మే ఎండింగ్ లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే 31 అంటే మహేష్ బాబుకు చాలా సెంటిమెంట్. ఎందుకంటే అదే రోజు తన తండ్రి సూపర్ స్టాట్ కృష్ణ పుట్టినరోజు. తన ప్రతి సినిమాకు సంబంధించిన ఎదో ఒక అప్డేట్ ని అదేరోజు ఇవ్వడం మహేష్ కి అలవాటు. దీంతో మహేష్ బాబు కొత్త సినిమాకు సంబంధించిన పనులను ఆ రోజు మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాడట.

పరశురామ్ తో మహేష్ సినిమా చేస్తున్నట్లు ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు గాని దాదాపు అతనితోనే మహేష్ తన 27వ ప్రాజెక్టును పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక ఆ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకొనున్నట్లు సమాచారం.
సరిలేరు నికేవ్వరు సినిమాను ఎంత స్పీడ్ గా ఫినిష్ చేశారో అదే స్పీడ్ లో పరశురామ్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని ప్రిన్స్ టార్గెట్ పెట్టుకున్నారట. ఇక అనిల్ రావిపూడితో కూడా మహేష్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఒక కథ సెట్ చేసిన అనిల్ వేరే స్టార్ట్స్ ఒక సినిమా చేసిన తరువాత మహేష్ సినిమాను ఎనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











