SSMB 28: మరికొన్ని రోజులు ఆలస్యంగా మహేష్ సినిమా.. ఆ రోజు నుంచే అసలు వేట!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ హోదా ఏ స్థాయిలో పెరిగిపోయిందో ఇటీవల పోకిరి సినిమాతో మరోసారి రుజువయింది. సినిమా వచ్చి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా మహేష్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు అని పోకిరి రీ రిలీజ్ తో చాలా క్లారిటీగా అర్థమయింది. ఇక తదుపరి సినిమాపై కూడా అంచనాలు అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న 28వ సినిమాను ఎప్పుడు మొదలుపెడతాడా ఎప్పుడు విడుదల చేస్తాడా అని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అసలైతే ఈ ప్రాజెక్టు ఈపాటికి మొదలవ్వాల్సింది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తవాల్సింది. కానీ వివిధ కారణాల వలన ఆ సినిమా వాయిదా పడుతూ వస్తోంది షూటింగ్ కూడా ఇంకా మొదలుపెట్టలేదు. అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలు స్ట్రైక్ కు దిగడంతో మరికొంత ఆలస్యమైంది.

ఇక ఆగస్టు 15 తర్వాత మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ డేట్ ను కూడా మళ్ళీ కన్ఫ్యూజన్లో పెట్టేశారు. ఆరోజు కూడా సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం. ఇక ఫైనల్ గా ఆగస్టు 21 నుంచి ముహూర్తం ని బట్టి మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ అయితే ఇప్పటికే సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ అందరినీ కూడా రెడీ చేసుకున్నాడు. అలాగే నటీనటుల లిస్ట్ కూడా ఫైనల్ అయింది. ఇక షెడ్యూల్స్ సెట్ చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసే సమ్మర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక ఆ తర్వాత మహేష్ బాబు పూర్తిగా రాజమౌళి ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు.


Click it and Unblock the Notifications











