twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారే నిజమైన సూపర్ హీరోలు.. మనల్ని రక్షిస్తున్న వారిని మనం కాపాడుకోవాలి.. వేడుకున్న మహేష్ బాబు

    |

    ప్రస్తుతం కరోనా వైరస్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచం మొత్తం కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. మన దేశంలోనూ కరోనా కోరలు చాచింది. ఇప్పటికే దాదాపు 37 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 1200 మందికిపైగా మరణించారు. ఇంతలా వణికిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు గత నెల నుంచి లాక్ డౌన్‌ను కఠినంగా అమలుపరుస్తూనే ఉన్నారు. కరోనాపై పోరాటం చేసేందుకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్న పోలీసులు, వైద్యులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. కొన్ని చోట్ల వారిపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అలాంటి బాధాకరమైన ఘటనలపై మహేష్ బాబు స్పందించాడు.

    Recommended Video

    Mahesh Babu, Ram Charan To Team Up With New Project After RRR | Filmibeat Telugu
    వైద్యులపై దాడి..

    వైద్యులపై దాడి..

    కరోనా వైరస్‌పై పోరాటం చేసేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరంతరం శ్రమిస్తున్న వైద్యులపై దాడి చేసిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనలను దేశం మొత్తం ఖండించింది. ఆ ఘటనల తరువాత వైద్యుల భద్రతకు అనుకూలంగా చట్టాన్ని కూడా సవరించారు.

    పోలీసులు, వైద్యులకు కరోనా..

    కరోనా విస్తరించుకుండా సమాజాన్ని కాపాడేందుకు ముందు వరుసలో నిలబడ్డ పోలీసులకు, వైద్యులకు కూడా కరోనా సోకింది. రోజురోజుకూ ఈ కరోనా కేసులు పెరిగిపోతోన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో దేశాన్ని కాపాడుతున్న వారికి కూడా కరోనా సోకడం, అంత గొప్ప త్యాగాలను చేస్తున్న వారిపై దాడులు చేయడంపై సూపర్ స్టార్ స్పందించాడు.

    మన కోసమే శ్రమిస్తున్నారు..

    మన కోసమే శ్రమిస్తున్నారు..

    ఇలాంటి విపత్కర పరిస్థితిలో మనందరిని రక్షిస్తూ భద్రంగా చూసుకుంటున్న ఆరోగ్య కార్యకర్తలందరికీ రుణపడి ఉండాలి.. మనమంతా వారి పక్షాన నిలబడాలి. వారి నిస్వార్థమైన, అలుపులేని శ్రమను గుర్తించాలి. ఇదంతా వారు మన భద్రత కోసమే చేస్తున్నారని మనం తెలుసుకోవాలి.

    వారిని కాపాడుకోవాలి..

    వారిని కాపాడుకోవాలి..

    మనకిష్టమైన వారిని వదిలేసి ఇలాంటి భయంకరమైన యుద్దంలో ముందుండి నడవడం చాలా గొప్ప విషయ.. వారి జీవితాలను పణంగా పెట్టి మన కోసం శ్రమిస్తున్నారు. మనల్ని రక్షిస్తున్న వారిని మనం కాపాడుకోవాలి. మనకోసం అంత చేస్తున్నవారికి మన ఇవ్వగలిగిన గొప్ప బహుమతి ప్రేమ మాత్రమే. నేను మీ అందర్నీ ఒకటే కోరుతున్నాను.. వారిపట్ల దయచూపండి.. వారే నిజమైన సూపర్ హీరోలు..గౌరవించండ'ని ఎమోషనల్ అయ్యాడు.

    English summary
    Mahesh Babu urge That Respect Health Workers In Covid 19 Crisis. He Tweeted That I urge you all to be kind and courteous towards our medical workers... Our true superheroes. Huge respect
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X