మరోసారి శ్రీమంతుడి‌లా మహేష్ బాబు.. కరోనా పరిస్థితుల్లో షాకింగ్ నిర్ణయం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ హీరోగా ఎంత క్రేజ్ తెచ్చుకున్నా కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం సింపుల్ గా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతాడు. వీలైనంత వరకు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తనదైన శైలిలో వర్క్ చేసుకుంటూ వెళతాడు. ఇక మహేష్ ఇటీవల మరోసారి శ్రీమంతుడు సినిమా తరహాలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందరూ హీరోలు కూడా ఇలానే చేస్తే ఎంతోమందిని కాపాడవచ్చు అనే కామెంట్స్ వస్తున్నాయి.

 ఆ బ్రాండ్ వాల్యూ.. మరో స్థాయికి

ఆ బ్రాండ్ వాల్యూ.. మరో స్థాయికి

ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ వారసత్వం నుంచి వచ్చిన మహేష్ ఆ బ్రాండ్ ను మరో లెవెల్ కు తీసుకువెళుతున్నాడు. చాలా వరకు ప్రయివేట్ లైఫ్ ను ఇష్టపడే మహేష్ సినిమా షూటింగ్స్ తరువాత ఫ్యామిలీతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. తన పిల్లలు, బార్యతోనే సరదాగా గడుపుతుంటాడు.

పిల్లలకు కూడా అభిమానులు

పిల్లలకు కూడా అభిమానులు

ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. మహేష్ పిల్లలు గౌతమ్, సితారలకు అభిమనులు ఏ రేంజ్ లో ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా సితార్ ఫోటోలకు వీడియోలు మిలియన్ల లైక్స్ వస్తుంటాయి.

1000కి పైగా పసి ప్రాణాలకు ఊపిరి పోశారు

1000కి పైగా పసి ప్రాణాలకు ఊపిరి పోశారు

అసలు మ్యాటర్ లోకి వస్తే మహేష్ బాబు మరోసారి శ్రీమంతుడు తరహాలో గ్రామాలకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే మహేష్ ఎంతో మందికి సహాయం చేశాడు. ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన హార్ట్ ఆపరేషన్స్ చాలానే చేశాడు. భార్య నమ్రత ఆధ్వర్యంలో 1000కి పైగా పసి ప్రాణాలకు ఊపిరి పోశారు.

ఆ గ్రామాలను దత్తత తీసుకొని

ఆ గ్రామాలను దత్తత తీసుకొని

ఇక మహేష్ బుర్రిపాలెం, సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకొని ప్రతి సారి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ వస్తున్నాడు. బుర్రిపాలెం మహేష్ సొంత గ్రామమని అందరికి తెలిసిన విషయమే. ఇక శ్రీమంతుడు తరహాలోనే మహేష్ ఆ గ్రామాభివృద్ధికి చాలాసార్లు సహాయపడ్డాడు.

మరోసారి బాధ్యత తీసుకున్న మహేష్

మరోసారి బాధ్యత తీసుకున్న మహేష్

ఇక ప్రస్తుతం కరోనా పరిస్థితులల్లో ఆంద్రప్రదేశ్ లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇక మరోసారి. మహేష్ తన దత్తత గ్రామాల ప్రజల ఆరోగ్యం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు. బుర్రిపాలెం, సిద్ధాపురం గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించే బాధ్యతను తీసుకున్నట్లు సమాచారం.

 ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించెలా

ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించెలా

చాలా వరకు ఎంతోమంది గ్రామాలను దత్తత తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాల అనంతరం చేతులు దులిపేసుకుంటారు. కానీ మహేష్ అలా కాకుండా బాధ్యతాయుతంగా ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించెలా ఏర్పాట్లు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతి ఒక్క హీరో కూడా ఇలానే చేస్తే కనీస కొన్ని గ్రామాలు అయినా ఈ సమస్యల నుంచి కోలుకునే ఛాన్స్ ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X