అఖిల్ మ్యారేజ్ రిసెప్షన్‌లో స్పెషల్ ఎట్రాక్షన్.. మహేశ్ ధరించిన టీ షర్ట్ ఎన్ని లక్షలంటే?
అక్కినేని నాగార్జున - అమల దంపతుల కుమారుడు అఖిల్ అక్కినేని వివాహం జూన్ 6వ తేదీన నాగార్జున నివాసంలో ఘనంగా జరిగింది. అతికొద్దిమంది సమక్షంలో ఈ వేడుక జరగ్గా.. సినీ ప్రముఖులు, అభిమానులు, ఇతర సెలబ్రెటీల కోసం జూన్ 8వ తేదీన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు నాగార్జున. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌తో పాటు తమిళ, కన్నడ సినీనటులు, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులై హాజరై అఖిల్ - జైనాబ్‌లను ఆశీర్వదించారు.
అఖిల్ రిసెప్షన్‌లో అట్రాక్షన్‌గా మహేశ్
అయితే అఖిల్ - జైనాబ్‌ల వెడ్డింగ్ రిసెప్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సూపర్‌స్టార్ మహేశ్. భార్య నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితారలతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన పాతికేళ్ల కుర్రాడిగా మెరిసిపోయారు. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు వస్తుంటాయి. వయసు ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది. అయితే మహేశ్ మాత్రం వయసు పెరిగేకొద్దీ ఇంకా కుర్రాడిగా మారిపోతున్నారు. ఎప్పటికప్పుడు తన స్టైల్, హ్యాండ్సమ్ లుక్‌తో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోతున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 9తో ఆయన 50వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. కానీ మహేశ్‌ను అఖిల్ రిసెప్షన్‌లో చూసిన ఎవరైనా సరే ఆయనకు పాతికేళ్లు కూడా ఉండవని అనుకోవాల్సిందే.

మహేశ్ గ్లామర్ సీక్రెట్ ఏంటీ?
మహేశ్ అన్నం తింటున్నాడా? అందం తింటున్నాడా? అంటూ కుర్రాళ్లే కుళ్లుకుంటూ ఉంటారు. ఆయన హెల్త్, ఫిట్నెస్, గ్లామర్ సీక్రెట్ ఏంటీ అని తెలుసుకోవాలని అనుకుంటారు. మహేశ్ గ్లామర్ వెనుక సీక్రెట్‌పై రకరకాల కథనాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. యోగా, మెడిటేషన్, జిమ్‌లో వర్కవుట్స్‌తో పాటు ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం వలనే మహేశ్ బాబు ఇంత అందంగా ఉండగలుగుతున్నారని చెబుతున్నారు. దీనికి తోడు మహేశ్ బాబు మూన్ ధ్యానమనే ప్రత్యేక క్రియ చేస్తారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. దీనిని సాధన చేసే క్రమంలో ఒక రకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోవడంతో మనసు, శరీరం ఆయన ఆధీనంలోకి వస్తుంది. ఇలా చేసే వారు ఎల్లప్పుడూ అందంగా, ప్రశాంతంగా ఉంటారని కొందరు చెబుతున్నారు.
మహేశ్ టీషర్ట్ చాలా కాస్ట్‌లీ
ఇక అఖిల్ - జైనాబ్‌ల వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా టీ షర్ట్‌లో హాజరయ్యాడు మహేశ్ బాబు. ఫ్లవర్ ప్రింటింగ్ ఉన్న ఈ లైట్ గ్రీన్ కలర్ టీషర్ట్‌పై అభిమానుల కళ్లు పడ్డాయి. దాంతో ఇది ఏ బ్రాండ్ టీ షర్ట్? ధర ఎంత? వంటి వివరాలన్నీ ఆరా తీశారు. మహేశ్ ధరించిన టీషర్ట్ చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నా .. చాలా కాస్ట్‌లీ అని ఈ ఎంక్వైరీలో తేలింది. ప్రపంచ ప్రఖ్యాత హెర్మ్స్ అనే లగ్జరీ బ్రాండ్ ఈ టీషర్ట్‌ని డిజైన్ చేసింది. ఈ సంస్థ వెబ్‌సైట్ ప్రకారం మహేష్ ధరించిన టీ షర్ట్ ధర అక్షరాలా లక్షా 51 వేల 678 రూపాయలు. ఈ రేటు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ టీ షర్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా పలువురు దీనిని సొంతం చేసుకోవడానికి క్యూకడుతున్నారట.
SSMB29 షూటింగ్‌లో మహేశ్ బిజీ
ఇకపోతే.. ప్రస్తుతం మహేష్ బాబు .. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్, ఒడిషాలలో ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు రాజమౌళి. ఈ భారీ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











