మిలటరీ అధికారిగా మహేష్.. ఆ అంశాలని హైలైట్ చేస్తూ సినిమా!

మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నారు. ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నాడు. అనిల్ వినిపించిన కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి కథకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి సిద్ధం చేసిన కథకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ చిత్రంలో మహేష్ బాబు మిలటరీ అధికారిగా కనిపిస్తాడని అంటున్నారు. మహేష్ పాత్రలో ఎక్కువగా దేశభక్తి కనిపిస్తుందట. సెలవుల్లో తన సొంత ఊరికి వచ్చిన మిలటరీ అధికారి కథగా అనిల్ రావిపూడి ఈ చిత్రం తెరకెక్కించబోతున్నాడు. దేశభక్తితో పాటు, హాస్యాన్ని అనిల్ రావిపూడి ఈ చిత్రంలో హైలైట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 Mahesh Babu will be seen as military officer in Anil Ravipudi movie

త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. మహర్షి ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే అనిల్ రావిపూడి చిత్రాన్ని మహేష్ పట్టాలెక్కించనున్నాడు. అనిల్ రావిపూడి చిత్రంలో మహేష్ కు జోడిగా క్రేజీ హీరోయిన్ రష్మిక మందన నటించే అవకాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X