ముగ్గురు డైరెక్టర్లతో మహేష్ బాబు మీటింగ్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
Recommended Video

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ ఇటీవలే పొల్లాచ్చిలో పూర్తవ్వడంతో యూనిట్ మొత్తం తిరిగి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం.
'మహర్షి' నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే వారం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. షూటింగుకు వారం గ్యాప్ ఉండటంతో సూపర్ స్టార్ ఈ సమయాన్ని ముగ్గురు డైరెక్టర్లను మీట్ అవ్వడానికి కేటాయించినట్లు టాక్.

మొదట సుకుమార్‌తో మీటింగ్
మహేష్ బాబు తన తర్వాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ వారం జరిగే మీటింగులో సుకుమార్ కంప్లీట్ స్క్రిప్టు సూపర్ స్టార్‌కు వినిపిస్తారని సమాచారం. స్క్రిప్టు విని ఆయన ఒకే అంటే సుక్కు తన తర్వాతి పనుల్లో బిజీ కానున్నాడు.

ఆ ఇద్దరు డైరెక్టర్లతో కూడా...
సుకుమార్‌తో పాటు ‘ఎఫ్ 2' ఫేం అనిల్ రావిపూడి, ‘అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ వంగాతో కూడా మహేష్ బాబు వేర్వేరుగా మీటింగ్స్ జరుపనున్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్స్‌లో ఈ ఇద్దరు దర్శకులు తమ వద్ద ఉన్న స్క్రిప్టును మహేష్ బాబుకు వివరిస్తారని టాక్.

వారి పనితీరుతో ఇంప్రెస్ అయిన మహేష్
ఇటీవల విడుదలైన ‘ఎఫ్ 2' మహేష్ బాబుకు చాలా నచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెలుబుచ్చారు. ఆయనకు నచ్చిన సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి' కూడా ఒకటి. ఈ ఇద్దరి దర్శకుల వద్ద తనకు సూటయ్యే స్క్రిప్టు ఉంటే చేసేందుకు మహేష్ బాబు సుముఖంగా ఉన్నారట.

మహర్షి
‘మహర్షి' మూవీ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రం. తెలుగులో ఇప్పటి వరకు రాని ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే తొలిసారి నటిస్తోంది. అల్లరి నరేష్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











