పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై మహేశ్ బాబు ట్వీట్: త్వరగా కోలుకోవాలంటూ కామెంట్.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో నెంబర్ వన్ హీరోగా ఎదిగిపోయాడు ప్రిన్స్ మహేశ్ బాబు. ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్‌తో దూసుకుపోతున్నాడు. అంతేకాదు, ఒకటి పట్టాలపై ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెడుతూ సత్తా చాటుతున్నాడు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలపై స్పందిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కరోనా వైరస్ బారిన పడిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ఆరోగ్యంపై మహేశ్ ట్వీట్ చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఐషా శర్మ.. క్లివేజ్ షో రచ్చ మాములుగా లేదు

వరుసగా మూడు హిట్లు.. ఫుల్ జోష్‌లో

వరుసగా మూడు హిట్లు.. ఫుల్ జోష్‌లో

కొన్నేళ్లుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఆ మధ్య భారీ పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్న అతడు.. ఇటీవలి కాలంలో అతడు వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడు ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేశాడు. దీనిపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

సర్కారు వారి పాట అంటూ వస్తున్నాడు

సర్కారు వారి పాట అంటూ వస్తున్నాడు

పరశురాం దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తోన్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

 అందులో యాక్టివ్.. అందరివాడు అనేలా

అందులో యాక్టివ్.. అందరివాడు అనేలా

సోషల్ మీడియాలో మహేశ్ బాబు ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అతడు సమాజంలో జరిగే ఎన్నో విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. అంతేకాదు, వేరే హీరోల సినిమాలు చూడడం.. వాటిని అభినందిస్తూ ట్వీట్లు చేయడం.. విడుదలకు ముందు శుభాకాంక్షలు చెప్పడం వంటివి కూడా చేస్తున్నాడు. దీంతో అందరివాడు అనిపించుకుంటున్నాడు.

పవన్ కల్యాణ్ వర్సెస్ మహేశ్ బాబుగా

పవన్ కల్యాణ్ వర్సెస్ మహేశ్ బాబుగా

సినిమాల పరంగా మహేశ్ బాబు దూసుకుపోతున్నాడు. దీంతో అతడి అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతేకాదు, ఇతర హీరోలపై కొందరు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 'వకీల్ సాబ్' మూవీ విడుదలైన సమయంలో పవన్ కల్యాణ్‌ను కించపరుస్తూ చాలా మంది ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో వార్ నడిచింది.

పవన్ గురించి పోస్టు.. మూయించాడు

పవన్ గురించి పోస్టు.. మూయించాడు

మహేశ్ బాబు ఇటీవల 'వకీల్ సాబ్' సినిమాను చూసినట్లు తెలిపాడు. అంతేకాదు.. ఆ సినిమాపై పవన్ నటన గురించి చెబుతూ.. 'వకీల్ సాబ్‌లో పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్‌గా నటించాడు. సరైన కమ్‌బ్యాక్ ఇది. అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టేశాడు. అతడికి నా శుభాకాంక్షలు' అని పేర్కొన్నాడు. ఈ ఒక్క ట్వీట్‌తో గొడవలు పెట్టుకునే ఇరువురి ఫ్యాన్స్ నోర్లు మూయించాడు.

Recommended Video

Akkineni Nagarjuna Says SS Thaman Is A Star
 పవన్ ఆరోగ్యంపై మహేశ్ బాబు ట్వీట్

పవన్ ఆరోగ్యంపై మహేశ్ బాబు ట్వీట్

తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మహేశ్ బాబు 'పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని ప్రార్థిస్తున్నాను' అంటూ పోస్టు పెట్టాడు. దీంతో మహేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిన్న మొన్నటి వరకూ తిట్టిన ఫ్యాన్స్ అతడిని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X