ఫస్ట్ టైమ్ షర్ట్ లేకుండా షాకిచ్చిన మహేష్ బాబు.. సీక్రెట్ సిక్స్ ప్యాక్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా వరకు ప్రతి సినిమాలో ఒకే రకమైన ఫిట్ నెస్ తో కనిపిస్తాడు. ఒక రకంగా అభిమానులకు కూడా అదే ఇష్టం. మహేష్ కూడా ప్రయోగాలు తనకు సెట్టవ్వవని సేఫ్ జోన్ లో వెళుతుంటాడు. ఎక్కువగా కాస్ట్యూమ్స్ తోనే కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తుంటాడు. అయితే మొదటిసారి మహేష్ షర్ట్ లేకుండా జనాల దృష్టిలో పడ్డాడు. ఆ ఫోటోతో ఇప్పుడు కొత్త తరహా కథనాలు వెలువడుతున్నాయి.

 సిగ్గేక్కువ..

సిగ్గేక్కువ..

చాలా వరకు మహేష్ బాబు షర్ట్ లేకుండా సినిమాలో కనిపించాలి అంటే చాలా సిగ్గుపడతాడు. తనకు అలాంటివి సెట్ కావనే భయం కన్నా కూడా సిగ్గుతోనే అలాంటి వాటికి దూరంగా ఉంటాడు. కేవలం వన్ నేనొక్కడినే సినిమాలోనే ఒక సీన్ కోసం బాడీని చూపించి చూపించనట్లుగా కవర్ చేశాడు. ఇక చాలా కాలం తరువాత ఒక స్పెషల్ ఫోటోతో నెటీజన్స్ కి షాకిచ్చారు.

లాక్ డౌన్ లో సరదగా..

లాక్ డౌన్ లో సరదగా..

లాక్ డౌన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో చాలా సరదాగా గడుపుతున్నారు. ప్రతిరోజు కొత్త తరహా గేమ్స్ తో ఇంట్లో చిన్న పిల్లడిలా అల్లరి చేస్తున్నాడట. కూతురు సితార, కొడుకు గౌతమ్ లతో కలిసి మహేష్ రోజుకో స్టిల్ తో దర్శనమిస్తున్నాడు.

 మొదటిసారి షర్ట్ లేకుండా..

మొదటిసారి షర్ట్ లేకుండా..

మహేష్ బాబు మొదటిసారి షర్ట్ లేకుండా దర్శనమిచ్చాడు. తన కూతురు సితారతో కలిసి స్విమ్ చేస్తున్న ఫోటోను నమ్రతా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. చాలా వరకు మహేష్ బాబు సినిమాల్లో షర్ట్ లేకుండా కనిపించలేదు. కానీ ఇప్పుడు ఒక ఫోటో ద్వారా తన ఫిట్ నెస్ ని అనుకోకుండా చూపించాల్సి వచ్చింది. చూస్తూంతే సూపర్ స్టార్ జిమ్ బాడీని గట్టిగానే సెట్ చేసుకున్నాడు అని కామెంట్స్ వస్తున్నాయి.

Recommended Video

Mahesh Babu & Sitara's Cute Video Shared By Namratha
 సిక్స్ ప్యాక్?

సిక్స్ ప్యాక్?

చాలా వరకు మహేష్ తన బాడీని సినిమాలో చూపించడానికి ఇష్టపడడు. కథలు డిమాండ్ చేసినా కూడా ఒప్పుకోడు. కథ ప్రకారం అలా తప్పకుండా చేయాల్సిందే అని అనుకుంటే మాత్రం సినిమాలను వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడట. ఇక ఇప్పుడు ఈ ఫోటో చూసిన తరువాత సీక్రెట్ సిక్స్ ప్యాక్ రెడీ చేస్తున్నాడు అనేలా కథనాలు వెలువడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X