మహేష్ బాబు కొత్త లుక్ వైరల్.. ఆ హాలీవుడ్ స్టార్‌ను తలదన్నేలా అంటూ నెటిజన్లు కామెంట్
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా బిజీ బిజీగా మారారు. దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే వెల్లడించాడు. వీరిద్దరూ క్రేజీ కాంబోలో మూవీ అనగానే ఆ మూవీపై అంచనాలు అమాంతం పెరగాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహేశ్ బాబు కూడా ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో మహేశ్ బాబు ఈ మధ్య ఫ్యాన్స్ కే కాదు కాదా.. మీడియా కు దొరకడం మానేశాడు. ఎన్నో రోజుల తరువాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లూక్స్ వైరల్ అవుతుంది. అచ్చు ఆ హలీవుడ్ హీరో లా ఉన్నారంటూ నెట్టిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు? మహేశ్ లూక్స్ ఎలా ఉన్నాయో చూసేయండి.
గత రెండు వారాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు వరద బాధితుల సహాయార్థం రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయాల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు యాభై లక్షల చొప్పున కోటి విరాళం అందిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. నేడు తన భార్య నమ్రతతో కలిసి జూబ్లీహిల్స్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. తాను వరద బాధితులకు ఇస్తానన్న ప్రకటించిన రూ.50 లక్షలు విరాళం సంబంధించిన చెక్ ను ముఖ్యమంత్రి అందజేశారు. అలాగే..తన కంప్లెక్స్ సంస్థ AMB తరపున మరో రూ.10లక్షలు విరాళం అందజేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.

అయితే.. సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ, ఆయన విరాళం ఎంత ఇచ్చాడనే విషయం కానీ వైరల్ అవ్వడం లేదు. సీఎం రేవంత్ రెడ్డికి చెక్‌ను అందజేసిన టైంలో మహేశ్, ఆయన సతిమణీ నమ్రతతో కలసి ఫోటోలు దిగగారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటో మహేష్ లాంగ్ హెయిర్, గడ్డంతో కనిపిస్తున్నారు. మొదటి సారిగా ప్రిన్స్ మహేశ్ బాబును అలా చూసే సరికి ఫ్యాన్ ఆగలేకపోతున్నారు. అచ్చు హాలీవుడ్ హీరోలా ఉన్నాడ్రా బాబు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు లుక్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. ఇక కొంత మంది ప్రిన్స్ అయితే.. హాలీవుడ్ హీరో కీన్ రీవ్స్ (Keanu Reeves)లా ఉన్నాడంటూ.. మహేశ్ ఫోటోను, కీన్ రీవ్స్ ఫోటోను పక్క పక్కన పెడుతూ పోస్టు చేస్తున్నారు. మరికొందరైతే.. అచ్చు హాలీవుడ్ హీరో ఉన్నాడనే సోన్ సూద్ డైలాగ్ ను ఆడ్ చేసే వీడియోలు, రీల్స్ చేస్తున్నారు.
ఇక హాలీవుడ్ స్టైలిష్ యాక్షన్ హీరోగా కీనూ రీవ్స్ విషయానికి వస్తే.. కెనడియన్-అమెరికన్ యాక్టర్..' ది మ్యాట్రిక్స్ ' అనే యాక్షన్ ఫిల్మ్ సిరీస్‌లో పాపులర్టీ సంపాదించుకున్నారు. ఆ తరువాత రివర్స్ ఎడ్జ్, బిల్ & టెడ్స్ ఎక్సలెంట్ అడ్వెంచర్, పాయింట్ బ్రేక్ మూవీస్ నటించి ప్రేక్షకులు మెచ్చుకున్నారు కీను రీవ్స్. ఆయన కేరీర్ లో విమర్శకుల ప్రశంసలు పొందిన మూవీ డ్రాక్యులా. ఇందులో కీను రీవ్స్ యాక్టింగ్ అదుర్స్ అనే చెప్పాలి. ఇలా కాన్‌స్టాంటైన్, ఎ వాక్ ఇన్ ది క్లౌడ్స్, ది డెవిల్స్, బాలేరినా, జాన్ విక్: చాప్టర్ 4, బిల్ & టెడ్ ఫేస్ ది మ్యూజిక్, ది మ్యాట్రిక్స్: రిసర్రెక్షన్స్ అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ , ఎ స్కానర్ డార్క్లీ , డేడ్ అండ్ ఎర్త్ స్టాడ్ స్టిల్ వంటి పలు హాలీవుడ్ సినిమాల్లో నటించారు. ఆయన కేవలం నటుడే కాదు. నిర్మాత,దర్శకుడు కూడా.
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు - స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. SSMB 29గా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ భారీ బడ్డెట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ హిట్ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం. ఈ మూవీలో సూపర్ స్థార్ మహేష్ బాబు హీరోగా నటించడంతో ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్ త్రిల్లర్ గా తెరకెక్కనున్నది.

ఈ మూవీ 18 శతాబ్దంలో జరిగే కథ అని, పీరియడ్ డ్రామా అని తెలుస్తోంది. అలాగే ఈ క్రేజీ మూవీలో అధిక భాగం అడవుల్లో షూటింగ్ జరుగుతుందనీ, ఇదో ఫారెస్ట్ ఎడ్వెంచర్ మూవీ అని టాక్. ఈ మూవీ అరుదైన గిరిజన జాతికి సంబందించిన రిఫరెన్స్ లు ఉండబోతున్నాయని, వారికి సంబంధించిన కాస్ట్టూమ్స్ కూడా డిజైన చేయించబోతున్నారు. ఈ తరుణంలో వందలాది జూనియర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీకి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. చాలా ఏళ్ల క్రితం ఆయనకు రాజమౌళి- మహేశ్ మాట ఇచ్చారు. దానిని ఈ సినిమాతో నిలిబెట్టుకుంటున్నట్లు సమాచారం. అడ్వేంచర్ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే.. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











