India Won T20 Cup: మహేష్ బాబు ట్వీట్ ట్రెండింగ్.. చరిత్రలో అలా నిలిచిపోయేలా అంటూ..
టీ20 ప్రపంచ కప్ పోటీల్లో భారత క్రికెట్ జట్టు అద్బుతమైన ఆటతీరును ప్రదర్శించడమే కాకుండా టైటిల్‌ను గెలుచుకోవడంతో 140 కోట్ల భారతీయుల హృదయాలు ఉప్పొంగేలా చేశాయి. ఈ టోర్నిలో తొలుత అటతీరులో తడబాటు కనిపించినా.. సెమిఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లో జట్టు ఆటగాళ్లు చేలరేగిపోయారు. ప్రత్యర్థి టీమ్‌ను కట్టడి చేసి విజయదుందుభి మోగించారు. ఈ విజయంతో సాధారణ ప్రజలతోపాటు, క్రీడాభిమానులు, సినీ తారలు తమ పోస్టులతో సోషల్ మీడియాను వేడిక్కించారు. తాజాగా టీమిండియా సాధించిన విజయంపై సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ వైరల్ అయింది. మహేష్ బాబు చేసిన ట్వీట్ వివరాల్లోకి వెళితే..
భారత జట్టు విజయం వెనుక జరిగిన ఉత్కంఠ విషయానికి వస్తే.. బలమైన న్యూజిలాండ్ జట్టుపై గెలుస్తుందా? అనుమానాల మధ్య భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అనేక అనుమానాలను పటాపంచలు చేస్తూ అభిషేక్ శర్మ, సంజయ్ శాంసన్ సుడిగాలి ఇన్నింగ్ ఆడారు. సంజయ్ 89 పరుగులు, అభిషేక్ 52 పరుగులు చేశారు. అదే స్పూర్తితో ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్‌తో ఆహ్మదాబాద్ స్టేడియంలో సునామీ క్రియేట్ చేశారు. ఇషాన్ కిషన్ 54 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించేలా తన ప్రతిభను చాటారు. చివర్లో శివమ్ దుబే కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో 26 పరుగులు చేయడంతో భారత్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది.

256 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు ఏ దశలోను గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో విజయం భారత్ పక్షాన నిలిచింది. కోట్లాది మంది ఎనలేని ఆనందాన్ని అందించింది. భారత విజయంపై మహేష్ బాబు ఆనందాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు.
అద్బుతమైన విజయం ఇది. బీస్ట్ మోడ్‌లో భారత జట్టు అధిపత్యాన్ని కొనసాగించింది. చిరస్మరణీయమైన గెలుపుతో 1.4 బిలియన్ ప్రజల మనసుల్లో చెరగని ముద్రవ ేసింది. శాంసన్, అభిషేక్, ఇషాన్ కిషన్, దుబే, బుమ్రా, అక్సర్ పటేల్ అద్బుతమైన ప్రతిభను చాటారు. వారి ఆట తీరును ఎప్పటికీ మరువలేనిదిగా చరిత్రలో నిలిచిపోతుంది. హిస్టరీ క్రియేట్ చేసిన భారత జట్టుకు శుభాకాంక్షలు. ఈ విజయంతో చరిత్రలో మరో పేజి చిరస్థాయిగా నిలుస్తుంది. జై హింద్ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
మహేష్ బాబు కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి చిత్రంలో నటిస్తున్నారు. గ్లోబల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకొన్నది. మరో షెడ్యూల్ కోసం టీమ్ రెడీ అవుతున్నది. ఈ చిత్రం 2027 ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











