షాకిచ్చిన మహేష్.. అంతా అనుకున్నట్లుగా కాకుండా!

Recommended Video

Maharshi Vijayotsavam : Mahesh Babu Missed One Thing At Maharshi Vijayotsavalu In Vijayawada

సూపర్ స్టార్ మహెష్ బాబు ఊహించిన దానికి భిన్నంగా ప్రవర్తించి అందరికీ షాకిచ్చారు. మహర్షి విజయంతో మహా జోష్‌లో ఉన్న ఈ రాజకుమారుడు విజయవాడలో జరిగిన విజయోత్సవ సభలో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశారు. మహర్షి సినిమా తన కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమా అని ప్రకటిస్తూ ఇప్పటికే రెండుసార్లు కాలర్ ఎగరేసిన మహేష్ ముచ్చటగా మూడోసారి విజయవాడ సభలో కాలర్ ఎగరేస్తాడేమోనని భావించారంతా. కానీ అలా జరగలేదు. కేవలం మామూలు స్పీచ్‌తో మహేష్ పని కానిచ్చేశారు. దీంతో మహేష్ కాలర్ ఎగరేస్తే చూసి గర్వించాలనే విజయవాడ అభిమానుల ఆశ నిరాశగానే మిగిలింది.

విజయవాడలో సక్సెస్ సెలెబ్రేషన్స్

విజయవాడలో సక్సెస్ సెలెబ్రేషన్స్

మహేష్ బాబు కెరీర్‌లో 25 వ సినిమాగా రూపొందిన మహర్షి సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికీ 150 కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమా 200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో ఆనందోత్సహాల్లో మునిగి తేలుతున్న చిత్రయూనిట్ విజయవాడ వేదికగా గ్రాండ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకకు మహేష్ సహా యూనిట్ సభ్యులంతా హాజరయ్యారు.

ఆకట్టుకున్న మహేష్..

ఆకట్టుకున్న మహేష్..

తమ అభిమాన హీరోని చూసే అరుదైన అవకాశం వచ్చిందని భావించిన విజయవాడ ప్రజానీకం పెద్ద ఎత్తుక ఈ వేడుకకు తరలి వచ్చింది. అశేష అభిమాన వర్గం నడుమ మహేష్ స్పీచ్ అదరగొట్టేసింది. కనక దుర్గమ్మ తల్లిని స్మరించుకుంటూ మహేష్ తన మహర్షి సినిమానుద్దేశించి మాట్లాడారు. అయితే ఈ స్పీచ్‌లో కాస్త వెలితి కనిపించిందని అంటున్నారు మహేష్ అభిమానులు. అదే ఆయన కాలర్ ఎగరేయకపోవడం అని చెప్పుకుంటున్నారు.

ఆశగా చూసిన అభిమానుల్లో నిరాశ

ఆశగా చూసిన అభిమానుల్లో నిరాశ

ఇప్పటికే 'మహర్షి' సినిమా విషయంలో రెండుసార్లు తన కలర్ ఎగరేశారు మహేష్ బాబు. దీంతో దుర్గమ్మ సాక్షిగా మూడోసారి మహేష్ కాలర్ ఎగరేస్తాడని భావించారంతా. కానీ అలా జరగకపోవడం ఆశగా చూసిన ఆయన అభిమానులకు కాస్త నిరాశనే మిగిలిందట. మొదటి సారి సినిమా రిలీజ్ అయిన తర్వాత కాలర్ ఎగరేసి ప్రేక్షకుల్లో హుషారు నింపిన మహేష్ ఆ తర్వాత హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్‌లో మరోసారి దాన్నే రిపీట్ చేసి ఆశ్చర్యపర్చిన సంగతి తెలిసిందే.

మహర్షి మూవీ

మహర్షి మూవీ

వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో మహేష్ సిల్వర్ జూబ్లీ సినిమాగా మహర్షి ప్రేక్షకుల ముందుకొచ్చింది. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే చిందులేయగా.. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఎపిక్ బ్లాక్‌బస్టర్ సినిమాగా అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటోంది మహర్షి మూవీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X