మరీ యంగ్‌గా మారిపోయిన మహేష్.. రాజకుమారుడు గుర్తొస్తున్నాడు!
సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. రోజులు గడిచే కొద్దీ మహేష్ వయసు తగ్గిపోతోంది. మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం మహేష్ గడ్డం, మీసాలతో డిఫెరెంట్ లుక్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కు కొంత గ్యాప్ ఇచ్చిన మహేష్ ప్రస్తుతం జర్మనీలో ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్ళాడు.
ఫ్యామిలీతో మహేష్ వెకేషన్ లో గడుపుతున్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో మహేష్ లుక్ చూసి చూపు తిప్పుకోవడం నెటిజన్ల వల్ల కావడం లేదు. అంత యంగ్ గా స్టైలిష్ గా మహేష్ కనిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ ఫోటోలలో మహేష్ రాజకుమారుడు సమయంలో మహేష్ ని గుర్తుకు తెస్తున్నాడు.


మహేష్ కొత్త లుక్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మహర్షి చిత్రంలో రెండు విభిన్నమైన లుక్స్ లో మహేష్ కనిపిస్తాడట. అందులో భాగంగానే మహేష్ తాజగా గడ్డం, మీసాలు లేకుండా కనిపిస్తున్నాడని అంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిల్ రాజు, అశ్వినీదత్ ఈ చిత్రానికి నిర్మాతలు.


Click it and Unblock the Notifications











