రొమాంటిక్ లవ్ స్టోరీతో సెంచరీ కొట్టిన నాగచైతన్య - సమంత
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ సెలబ్రెటీ కపుల్స్ లో అక్కినేని యువ జంట కూడా ఉంది. ఏ మాయ చేసావే సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్న సమంత - నాగచైతన్య మొదటి నుంచి కూడా బెస్ట్ జోడి అనిపించుకుంటున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన మనం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసింది. మధ్యలో బాచ్చిన ఆటో నగర్ సూర్య కాస్త నిరాశపరిచిన విషయం తెలిసిందే.
ఇక మూడవసారి చేసిన మజిలీ బాక్సాఫీస్ వద్ద అంతకుమించి అనేలా వర్కౌట్ అయ్యింది. వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న నాగ చైతన్యకు ఎలాగైనా మంచి హిట్టివ్వాలని అనుకున్న సతీమణి సమంత మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్టిచ్చింది. నాగచైతన్య కెరీర్ కు ఆ సినిమా బాగా హెల్ప్ అయ్యింది. ఇక హిందీలో డబ్ చేసి యూ ట్యూబ్ లో విడుదల చేయగా 100మిలియన్ల వ్యూవ్స్ అందుకోవడం విశేషం.

ఇక ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. మజిలీ సినిమా హిట్టయిన తరువాత నాగచైతన్య - సమంత మరొక సినిమా చేయాలని అనుకున్నారు. ఆ మధ్య ఇద్దరి దర్శకులతో కూడా చర్చలు జరిపినట్లు టాక్ వచ్చింది. కానీ వర్కౌట్ కాలేదు. ఇక ప్రస్తుతం నాగ చైతన్య విభిన్నమైన సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ విడుదలకు సిద్దంగా ఉండగా థాంక్యూ సినిమా కూడా రెడీ అవుతోంది. ఇక బాలీవుడ్ లో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











