నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం.. దర్శకుడు ఎవరో తెలుసా!
నందమూరి కళ్యాణ్ రామ్ చివరగా నటించిన చిత్రం 118. కెవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చిలో ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోవడంతో విజయం సాధించింది. 118 ద్వారా కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత మంచి విజయాన్ని అందుకున్నాడు. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన విజవయంతమైన చిత్రం 118. ఈ చిత్రం అందించిన ఉత్సాహంతో కళ్యాణ్ రామ్ మరిన్ని చిత్రాలకు సిద్ధం అవుతున్నాడు.
కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రం మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోసియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని తుగ్లక్ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారట. ఈ చిత్రంతో పాటు కళ్యాణ్ రామ్ మరో దర్శకుడిపై కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఉయ్యాలా జంపాల, మజ్ను లాంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన విరించి వర్మకు కళ్యాణ్ రామ్ ఓకే చెప్పాడట.

విరించి వర్మ పల్లెటూరి నేపథ్యంలో కళ్యాణ్ రామ్ కోసం చక్కటి కథని సిద్ధం చేశాడట. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలని కళ్యాణ్ రామ్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి కళ్యాణ్ రామ్ కంటెంట్ ఉన్న కథలనే ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











