తొడ కొట్టి చెప్పారు .. తానేంటో చూపించారు : పవన్‌ కళ్యాణ్‌కు విజయ్ సేతుపతి విషెస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాల్లో విజయాన్ని అందుకోవడంతో కూటమి కేడర్ సగర్వంగా కాలర్ ఎగరేస్తోంది. ఈ విజయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు. ఈ స్థాయి గెలుపు కూటమికి దక్కిందంటే దానికి ముఖ్య కారణం ఆయనే. కాపులు, మెగాభిమానులు, జనసేన కేడర్ పవన్ వెంట నడిచి ఓట్లు వేశారు. అభిమానులు, పార్టీ శ్రేణుల పదేళ్ల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే సాబ్ అయ్యారు. పిఠాపురంలో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. కేవలం తాను గెలవడంతో పాటు జనసేన పార్టీ తరపున పోటీ చేసిన ప్రతి ఒక్కరిని గెలిపించుకుని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

పవన్ విజయంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు గాల్లో తేలిపోతున్నారు. ఫలితాల విడుదల రోజున పవన్ సోదరి విజయదుర్గ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. మెగా ఫ్యామిలీ ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పి సంబరాలు జరుపుకుంది. వీటికి సంబంధించిన వీడియోలు నేటికీ వైరల్ అవుతున్నాయి. ఇక చిత్ర పరిశ్రమ ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కు విషెస్ తెలియజేస్తూ ఆయనపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ నటులు జనసేనానికి అభినందనలు తెలియజేస్తున్నారు.

makkal selvan vijay sethupathi praises janasena chief pawan kalyan over his victory in ap assembly elections 2024

తాజాగా ఈ లిస్ట్‌లోకి విలక్షణ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేరారు. ఆయన నటించిన తాజా చిత్రం 'మహారాజ'. జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పవన్ కళ్యాణ్ విజయం గురించి విలేకరులు ప్రశ్నించారు. ఆయన గురించి ఒక్క మాటలో ఏం చెబుతారని అడగ్గా.. విజయ్ స్పందించారు.

పవన్ కళ్యాణ్ శ్రమించే తత్వాన్ని తాను ఎంతగానో గౌరవిస్తానని.. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ఎంతో ట్రోలింగ్ జరిగిందని.. కానీ ఆయన తొడగొట్టినప్పుడు నిజ జీవితంలో ఎంత మాసో అర్ధమైందని విజయ్ చెప్పారు. ఏం జరిగినా , ఎన్ని అవరోధాలు ఎదురైనా స్థిరంగా ఉండటం ముఖ్యమని.. ఎవరో రాసిన కథలో పవన్ హీరో కాదు, ఆయన కథలో ఆయనే హీరో అని సేతుపతి ప్రశంసించారు.

పవన్ గురించి తనకు అంతగా తెలియదని, కానీ తన సన్నిహితులైన కొందరు తెలుగువారు మాత్రం వారి వాట్సాప్ , ఇన్‌స్టా స్టేటస్‌లలో పవన్ వీడియోలు పెట్టుకున్నారని విజయ్ తెలిపారు. వాటిని చూసి ఎందుకలా పెట్టారని ప్రశ్నించగా.. పవన్ వ్యక్తిత్వం, గొప్పతనం గురించి చాలా విషయాలు చెప్పారని ఆయన పేర్కొన్నారు. మన చుట్టూ ఉన్న వాళ్లు చెడ్డ విషయాలు, పుకార్లు సృష్టిస్తుంటారని.. ఇలాంటి ట్రోలింగ్‌ను , ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ఫైనల్‌గా పవన్ తనేంటో చూపించారని విజయ్ సేతుపతి ప్రశంసించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్, జనసేన అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X