48 ఏళ్ల వయసులో హద్దు దాటిన టాలీవుడ్ ఐటెం: వామ్మో ఇది హాట్ షో కాదు.. అంతకుమించిన అరాచకం!
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది నటీమణులు సినిమాల్లో చేయకున్నా.. నిత్యం ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటున్నారు. అదే సమయంలో అందాలు ఆరబోస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తున్నారు. ఇలా ఎంతో మంది సుందరీమణులు తమ అందచందాలతో ఊపు ఊపేస్తున్నారు. అలా చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న వారిలో ముదురు భామ మలైకా అరోరా ఒకరు. పెళ్లై విడాకులు తీసుకున్న ఈమె.. ఓ స్టార్ హీరోతో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అదీ కాక తరచూ అందాలు ఆరబోస్తూ దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. దీంతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

మోడల్‌గా పరిచయం అయింది
సినిమాల్లోకి రావడానికి ముందే మలైకా అరోరా మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నో యాడ్స్‌లో చేసింది. అదే సమయంలో తన అందచందాలతో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. ఇలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఎన్నో సినిమాలు, టీవీ షోలలో చేసింది. కానీ, ఆమెకు సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో మలైకా అరోరా యాక్టింగ్‌కు దూరమైంది.

ఐటెం స్పెషల్.. తెలుగులో అలా
నటిగా సక్సెస్ కాలేకపోయిన మలైకా అరోరా.. హిందీలో 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్' వంటి ఐటెం సాంగ్స్‌తో ఫేమస్ అయింది. అదే సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు 'అతిథి', పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ 'గబ్బర్ సింగ్'లో అదిరిపోయే ఐటెం సాంగ్స్‌తో ఫిదా చేసేసింది.

సల్మాన్ తమ్ముడితో పెళ్లి.. బ్రేకప్
వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న సమయంలోనే మలైకా అరోరా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. 2017లో వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులిచ్చేసింది. అప్పటి నుంచి మరో పెళ్లి మాత్రం చేసుకోలేదు.

వయసులో చిన్నోడితో లవ్ ట్రాక్
విడాకుల తర్వాత మలైకా అరోరా బాలీవుడ్ స్టార్ హీరో, బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేయడం మొదలెట్టింది. ఈ వ్యవహారం బహీర్గతం అయిన తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లకు వెళ్లడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం.. ఒకే ఇంట్లో కలిసి ఉండడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా
మలైకా అరోరా ప్రస్తుతం పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో ఎప్పుడూ యోగాలు చేస్తుంటుంది. అంతేకాదు, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు సైతం సూచనలు చేస్తోంది. ఇక, తనకు తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను తరచూ పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫాలోవర్లను భారీగా పెంచుకుంటోంది.

రెచ్చిపోయి చూపిస్తోన్న మలైకా
సోషల్ మీడియా మలైకా అరోరా చేసే హడావిడి అంతా ఇంతా కాదు. 48 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఇంటర్నెట్‌ను షేక్ చేయడంతో పాటు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
Recommended Video

అరాచకమైన ఫొటోలతో సందడి
మలైకా అరోరా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ సుందరాంగి స్టైలిష్ డ్రెస్ ధరించింది. ఫలితంగా ఆమె ఎద అందాలతో తొడలు నెటిజన్లను కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా వైరల్ అయిపోయింది. ఇక, ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











