For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mammootty turns 70 : తెలుగులో నటించగా రిలీజ్ కాని సినిమా ఏంటో తెలుసా?

  |

  మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి..తన సొంత భాషలో మంచి పాత్రలలో రాణిస్తూనే ఒక పక్క తెలుగు మరోపక్క తమిళ్ అనే కాకుండా ఎక్కడ అవకాశం ఉన్నానటిస్తూ మున్ముందుకు దూసుకుపోతున్నారు. ఆయన ఏ పాత్ర చేసిన కూడా అందులో ఒదిగిపోయి చేయడం ఆయన ప్రత్యేకత. తాను ఒక మెగాస్టార్ అనే ఏ మాత్రం హుందాతనం లేని మంచి మనిషి మమ్ముట్టి. ఎలాంటి పాత్ర అయినా, భాష ఏదైనా కూడా ఆ పాత్రకు ప్రాణం పోసి నటించే అతి కొద్దిమంది నటులలో మమ్ముట్టి ఒకరు. మమ్ముట్టి పూర్తి పేరు ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్ కాగా ఆయన మమ్ముట్టిగా ఫేమస్ అయ్యారు.

  ఆయన గురించి భారతదేశం మొత్తం మీద తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన మలయాళ నటుడు అయినా తెలుగులో కొన్ని డైరెక్ట్ సినిమాలు చేశారు. తన కెరీర్లో 400కి పైగా సినిమాల్లో ఆయన నటించాడు. రైల్వే కూలీ, సూర్య పుత్రలు, స్వాతి కిరణం, యాత్ర అనే సినిమాలు చేసినా అందులో రైల్వే కూలీ సినిమా విడుదల కాలేదు. ఇక స్వాతి కిరణం సినిమాతో ఆయన తెలుగువారికి దగ్గరయ్యారు.

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌ కంటెస్టెంట్ ఉమాదేవి హాట్ ఫొటోలు.. 'కార్తీక దీపం'లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!

  malayalam megastar Mammootty turns 70 birthday special

  కానీ ఈ తరం వారికి బాగా పరిచయం అయింది అయితే యాత్ర సినిమాతోనే. నిజానికి మమ్ముట్టి స్వాతికిరణం సినిమాలో శిష్యుడిపై ఈర్ష్య, ద్వేషాలు కలిగిన గురువుగా చూపిన నటనను ఎవరూ అంత తేలికగా ఆ తరం వారు అయితే మర్చిపోలేరు. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా తెలుగు చిత్రాల్లో నటించినా ఆయనకి పెద్దగా మనదగ్గర గుర్తింపు దక్కలేదు. అయితే, చివరిగా ఆయన నటించిన యాత్ర సినిమా ఆయనకు తెలుగు లో కూడా ఫుల్ క్రేజ్ ని తెచ్చిపెట్టింది.

  ఈ యాత్ర సినిమా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు చేసిన పాద యాత్ర నేపథ్యంగా తీసుకోని తెరకెక్కించారు. ఈ సినిమాలో నాకు వినిపిస్తోంది అంటూ ఆయన రాజన్న పాత్రలో చూపిన నటనకి ఫిదా అవ్వని తెలుగు ప్రేక్షకుడు ఉండడు, అందుకే ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.

  Bigg Boss Telugu 5: మీరెప్పుడు చూడని ఆనీ మాస్టర్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్

  malayalam megastar Mammootty turns 70 birthday special

  రాజన్న పాత్రలో మమ్ముట్టిని తప్ప ఇంకెవరిని ఉహించలేనంతగా నటించారని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈరోజు మలయాళ మెగా స్టార్ గా పేరున్న ఈ మమ్ముట్టి ఈరోజు 70వ పుట్టిన రోజు కావడంతో ఆయనకు ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ ఆయనకు విషెస్ చెబుతూ ప్రియమైన మమ్ముక్క ... తెరపై మీ అసమానమైన పవర్ హౌస్ లాంటి నటన ద్వారా భావితరాలకు స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు .. మీకు అపారమైన ఆనందం .. శాంతి, కలగాలని కోరుకుంటున్నా, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

  ఇక ఆయన వారసుడు దుల్కర్ సల్మాన్ కూడా సినీ రంగంలో ప్రవేశించి సత్తా చాటుతున్నారు. ఇక ఆయన అఖిల్-సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని అంటున్నారు. ఆయన మరిన్ని పాత్రాలు చేస్తూ ప్రేక్షకులను అల;అలరించాలని కోరుకుంటూ తెలుగు ఫిల్మీబీట్ ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

  English summary
  Mammootty turns 70 today in this Five decades, he acted over 400 films, here is connectivity with telugu movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X