మంచు మనోజ్ సినిమాలో మెగా హీరో: ఆ పాత్రలో కనిపించి మెప్పించనున్నాడట

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు ఎనర్జిటిక్ హీరో మనోజ్. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన అతడు.. 'దొంగ దొంగది' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఈ క్రమంలోనే కొన్ని విజయాలనైతే అందుకున్నాడు కానీ.. భారీ హిట్లను మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. దీంతో సరైన బ్రేక్ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నాడీ యంగ్ హీరో. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం సరికొత్త కాన్సెప్టుతో 'అహం బ్రహ్మాస్మి' అనే మూవీ చేస్తున్నాడు.

'ఒక్కడు మిగిలాడు' అనే సినిమా తర్వాత సినీ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చాడు మంచు మనోజ్. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత అతడు చేస్తున్న చిత్రమే 'అహం బ్రహ్మాస్మి'. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ఎమ్ ఆర్ట్స్ పతాకంపై మంచు ఫ్యామిలీలోని వాళ్లంతా స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటికే యాభై శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు.

Manchu Manoj Clarity about Sai Dharam Tej role

డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందుతోన్న 'అహం బ్రహ్మాస్మి' గురించి తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఈ మూవీలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడట. అయితే, అతడు చేసేది ఫుల్ లెంగ్త్ రోల్ మాత్రం కాదు. కేవలం రెండు నిమిషాల పాటు కనిపించే స్పెషల్ రోల్ అని తెలిసింది. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఆ పాత్ర అదిరిపోయే పంచ్‌తో ఓ ట్విస్టును రివీల్ చేస్తుందని అంటున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల్లోనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇందులోనే సాయి ధరమ్ సీన్స్ చిత్రీకరిస్తారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X