రెండో పెళ్లిపై మంచు మనోజ్ క్లారిటీ: డేటు, టైమ్ అంటూ చెప్పకనే చెప్పేసిన టాలెంటెడ్ హీరో

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో హీరోగా పరిచయం అయినప్పటికీ.. తనలోని ఎన్నో టాలెంట్లను బయటకు తీసుకొచ్చి ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు మంచు వారి అబ్బాయి మనోజ్. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచిన అతడు.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో పరాజయాలను చవి చూశాడు. అదే సమయంలో వైవాహిక జీవితంలోనూ కష్టాలను అనుభవించాడు. తద్వారా భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడు రెండో పెళ్లికి రెడీ అయ్యాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై మనోజ్ స్పందించాడు. ఆ వివరాలు మీకోసం!

స్టైలిష్ గా పూనమ్ బజ్వా కొత్త ఫోటోషూట్ (ఫొటోలు)

హీరోగానే కాదు... అలా కూడా మెప్పించాడు

హీరోగానే కాదు... అలా కూడా మెప్పించాడు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. 'దొంగ దొంగది' అనే మూవీతో హీరోగా పరిచయం అయిన అతడు.. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే, అతడికి సరైన హిట్ మాత్రం పడలేదు. కానీ సినిమాలు మాత్రం చేస్తూనే ఉన్నాడు.. హీరోగానే కాకుండా స్టంట్ మాస్టర్‌గానూ మనోజ్ చాలా సినిమాలకు పని చేశాడు.

సీక్రెట్‌గా లవ్ ట్రాక్.. ఆమెతో మనోజ్ వివాహం

సీక్రెట్‌గా లవ్ ట్రాక్.. ఆమెతో మనోజ్ వివాహం

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే మంచు మనోజ్ తన స్నేహితురాలు ప్రణతి రెడ్డితో చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించాడు. ఆ తర్వాత వీళ్లిద్దరూ 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన వారితో పాటు అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటులు హాజరైన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత స్పీడు తగ్గింది.. చాలా సమస్యలు

ఆ తర్వాత స్పీడు తగ్గింది.. చాలా సమస్యలు

సింగిల్‌గా ఉన్న సమయంలో జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేశాడు మనోజ్. కానీ, వివాహం తర్వాత స్పీడు తగ్గించేశాడు. అంతేకాదు, జీవిత భాగస్వామి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతడు కేవలం నాలుగు సినిమాలే చేశాడు. దీంతో అతడి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని, ఈ కారణంగానే సినిమాలు చేయట్లేదని ప్రచారం జరిగింది.

భార్యతో మనస్ఫర్థలు... విడాకులు ప్రకటించి

భార్యతో మనస్ఫర్థలు... విడాకులు ప్రకటించి

ప్రేమ వివాహమే చేసుకున్నప్పటికీ భార్య ప్రణతితో మనస్ఫర్థలు వచ్చాయని, ఈ కారణంగానే ఆమెతో విడాకులు తీసుకుంటున్నానని కొన్నేళ్ల క్రితం మంచు మనోజ్ ప్రకటించాడు. సోషల్ మీడియాలో సుదీర్ఘమైన లేఖను వదిలిన అతడు.. చాలా విషయాలు వెల్లడించాడు. వీళ్లిద్దరూ చాలా రోజుల నుంచి విడివిడిగా ఉన్నప్పటికీ.. విడాకుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే చెప్పాడు.

రీఎంట్రీ ఇస్తున్న మనోజ్.. ఇప్పుడదే పనిలో

రీఎంట్రీ ఇస్తున్న మనోజ్.. ఇప్పుడదే పనిలో

వైవాహిక జీవితంలో ఇబ్బందుల కారణంగా సినిమాలకు దూరమైన మంచు మనోజ్.. గత ఏడాది 'అహం బ్రహ్మాస్మి' అనే కొత్త తరహా చిత్రాన్ని ప్రకటించాడు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ఎమ్ ఆర్ట్స్ పతాకంపై మంచు ఫ్యామిలీలోని వాళ్లంతా స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

రెండో పెళ్లికి సిద్ధమైన మనోజ్.. స్పందించాడు

రెండో పెళ్లికి సిద్ధమైన మనోజ్.. స్పందించాడు

రెండు, మూడు రోజులుగా మంచు మనోజ్ మరో వివాహం చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు అన్ని మీడియా సంస్థల్లో ఈ వార్త హైలైట్ అవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఫలితంగా ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశం అవడంతో ఇది అతడి దృష్టికి కూడా వెళ్లింది దీంతో ఓ వెబ్‌సైట్ రాసిన కథనంపై ట్విట్టర్ వేదికగా మంచు మనోజ్ స్పందించాడు.

డేటు, టైమ్ అంటూ చెప్పకనే చెప్పేసిన హీరో

డేటు, టైమ్ అంటూ చెప్పకనే చెప్పేసిన హీరో

ఓ వెబ్‌సైట్ రాసిన కథనాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. దానికి మంచు మనోజ్ రిప్లై ఇచ్చాడు. 'డేటు టైము కూడా మీరే చెప్పండి' అంటూ బ్రహ్మానందం ఫొటోపై మీమర్స్ క్రియేట్ చేసిన ఫొటోలతో సెటైరికల్‌గా సమాధానం ఇచ్చాడు. తద్వారా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని చెప్పకనే చెప్పేశాడు. ఇకనైనా ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X