Manchu Manoj: అన్న విష్ణుతో ఫైట్ తర్వాత మనోజ్ ఫస్ట్ రియాక్షన్.. అలాంటి ట్వీట్ తో షాక్!
మంచు మనోజ్ బడా సినీ కుటుంబం బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనదైన మేనరిజం, స్టైల్, నటనతో ఆకట్టుకున్నాడు. దొంగ దొంగది, రాజు భాయ్, బిందాస్, వేదం సినిమాలతో హిట్ కొట్టిన మంచు మనోజ్.. పలు డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఈ పెళ్లి తర్వాత మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక శుక్రవారం రోజున అన్న విష్ణుకు సంబంధించిన ఫైట్ వీడియోను మంచు మనోజ్ షేర్ చేయడంతో మంచు ఫ్యామిలీ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఈ ఫైట్ తర్వాత మంచు మనోజ్ తొలిసారి స్పందించాడు.

బాలనటుడిగా ఎంట్రీ..
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. సీనియర్ ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నాదేశం, అడవిలో అన్న, ఖైదీగారు వంటి సినిమాల్లో అలరించాడు.
చాలా కాలం తర్వాత హీరోగా దొంగ దొంగది సినిమాతో డెబ్యూ చేసి శ్రీ, రాజు భాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, కరెంట్ తీగ, పాండవులు పాండవులు తుమ్మెద, పోటుగాడు, ఎటాక్, గుంటూరోడు లవ్ లో పడ్డాడు, ఒక్కడు మిగిలాడు వంటి చిత్రాలతో ఎంటర్టైన్ చేశాడు.

మంచు లక్ష్మీ ఇంట్లో..
మంచు బ్రదర్స్ అయిన హీరోలు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు ఉన్నట్లు గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. ఇదంతా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచే అని పలువురు భావిస్తున్నారు.
ఇద్దరూ పలకరించుకుంటున్నప్పటికీ దూరం మాత్రం అలాగే ఉందట. ఇక మంచు మనోజ్ పెళ్లి కూడా అక్క మంచు లక్ష్మీ ఇంట్లోనే జరిగిన విషయం తెలిసిందే. ఆ పెళ్లికి మోహన్ బాబు హాజరు కాగా విష్ణు మాత్రం రాలేదని ప్రచారం సాగింది.

పోలీసులకు ఫిర్యాదు..
ఇక ఇంతకాలం నాలుగు గోడల మధ్య ఉన్న మంచు విష్ణు, మనోజ్ విభేదాలు శుక్రవారం నెట్టింట్లో బహిర్గతం అయ్యాయి. మంచు మనోజ్ శుక్రవారం షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో సారథి అనే వ్యక్తి వద్దన్న వినిపించుకోకుండా అతని ముఖంపై విష్ణు కొట్టినట్లు టాక్. దీంతో సారథిని హాస్పిటల్ లో చేర్పించారు. ఇక ఈ విషయంపై మంచు విష్ణుపై పోలీసు ఫిర్యాదు చేసే ఆలోచనలో మనోజ్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అలాంటిదేం జరగలేదు.

ఆసక్తిగా మనోజ్ ట్వీట్..
ఇక మనోజ్ షేర్ చేసిన వీడియోపై మోహన్ బాబు సీరియస్ అయ్యారు. కుటుంబంలో జరిగే గొడవలను సోషల్ మీడియాలో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మనోజ్ పెట్టిన పోస్ట్ ను డిలీట్ చేయాలని మోహన్ బాబు ఆదేశించడంతో డిలీట్ చేశాడు.
మంచు మనోజ్, విష్ణు గొడవలను సద్దుమణిగేలా మోహన్ బాబు ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జరిగిన గొడవపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మనోజ్ చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది.

అలా షాక్ ఇచ్చిన మనోజ్..
మంచు విష్ణుతో గొడవ తర్వాత మొదటిసారిగా మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. అయితే అది సోదరుడు విష్ణుతో గొడవకు సంబంధించినది కాదు. కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ తండ్రి సుబ్రమణ్యం మణి శుక్రవారం (మార్చి 24) రోజున మరణించిన విషయం తెలిసిందే.
అజిత్ తండ్రి మరణం పట్ల అనేక మంది సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు. తాజాగా ఆయనకు సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేసి షాక్ ఇచ్చాడు మంచు మనోజ్.
తారక్ కు పక్కన నిలబడి..
"పీఎస్ మణి గారు మరణించారని తెలిసి బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ దుఃఖ సమయంలో అజిత్ గారికి, వారి మొత్తం కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని రాసుకొచ్చాడు మంచు మనోజ్.
ఇదిలా ఉంటే మనోజ్ కు సినీ ఇండస్ట్రీలోని అందరితో కలుపుగోలుగా ఉంటాడని తెలిసిందే. ఎవరికైనా అవసరం వస్తే సాయం అందించేందుకు ముందుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించినప్పుడు కూడా తారక్ కు పక్కన నిలబడిన తీరు అందరినీ ఆకట్టుకుంది తెలిసిన విషయమే.


Click it and Unblock the Notifications











