twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sai Dharam Tejపై 3D వార్తలు కాదు.. ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో జల్లెడ పట్టండి: మంచు మనోజ్ ఫైర్

    |

    సైదాబాద్ సింగరేణి కాలనీ లో అత్యాచారం హత్య ఘటనపై సినీ నటుడు మంచు మనోజ్ స్పంధించారు. హత్యాచారం కి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మనోజ్ వెంటనే వారికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ప్రభుత్వాన్ని కోరారు. అంతే కాకుండా మీడియా తీరుపై కూడా మనోజ్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై కాకుండా ఇలాంటి నిందితులకు శిక్ష పడేలా పోరాటం చేయాలని కోరారు. ఇక చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు

    అదొక క్రూరత్వం..

    అదొక క్రూరత్వం..

    పసిపాపకు జరిగిన దాన్ని అన్యాయం కూడా అనలేము. అదొక క్రూరత్వం. ఆ పాప తల్లిదండ్రులకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆ తల్లి కింద పడి ఏడుస్తూ ఉంటే నేను ఏమీ చేయలేని నిస్సహాయత లో ఉన్నాను. చేతకాని వాడి తరహాలో కూర్చున్నాను అనిపించింది. ఈ ఘటనను ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలి. మన ఇంట్లో వాళ్లకి అలాగే మన చుట్టుపక్కల వారికి అందరికీ కూడా ఆడపిల్లలకు ఎలా గౌరవించాలి అనే పద్ధతులను నేర్పించాలి. ప్రతి ఒక్కరికీ ఒక అవగాహన ఉండాలి. అది మనం డ్యూటీ కూడా

    ఆ రాక్షసుడు ఇంకా దొరకలేదు

    ఆ రాక్షసుడు ఇంకా దొరకలేదు

    ఇక అత్యాచార ఘటనలు జరిగే రోజులు గడుస్తున్నా కూడా ఆ రాక్షసుడు జాడ అస్సలు దొరకలేదు. పోలీస్ సిబ్బంది అలాగే మిగతా అధికారులు కూడా అతన్ని వెతకడం కోసం చాలా కష్టపడుతున్నారు అని తెలుసుకున్నాను. ఇక్కడ సీఐ గారితో కూడా రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. పోలీసులు అలాగే ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకుంటున్నారు అని నాకు తెలుసు. కానీ ఇలాంటి ఘటనలకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శిక్షలు పడేలా చట్టాలు రావాలి.

    24 గంటల్లోనే శిక్ష పడేలా..

    24 గంటల్లోనే శిక్ష పడేలా..

    గత ఏడాది ఛత్తీస్ ఘడ్ లో మూడు నెలల పాప పై జరిగిన అత్యాచారం ఘటన కు నేడు ఉరిశిక్ష వేసినట్లు తీర్పు వచ్చింది. కానీ ఇలాంటి కేసులకు ఒక సంవత్సరం కాదు 24 గంటల్లోనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. నేను ప్రతి ఒక్కరిని ఒకటే వేడుకుంటున్నాను. మీ సోషల్ మీడియాలో కూడా అతడు ఎక్కడున్నా తెలియజేయండి. మీడియా ఛానల్స్ కు కూడా ప్రత్యేకంగా చెబుతున్నాను. వీలైనంత త్వరగా అతన్ని పోలీసులకు పట్టించాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది.

    Recommended Video

    MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
    సాయి ధరమ్ తేజ్ పై వార్తలు కాదు..

    సాయి ధరమ్ తేజ్ పై వార్తలు కాదు..

    టీవీ చానల్స్ ఆన్ చేస్తే సాయి ధరమ్ తేజ్ ఎలా పడ్డాడు ఇలా పడ్డాడు అని త్రీడీలు చేస్తూ చూపిస్తున్నారు. కానీ ఇలాంటి ఇలాంటి ఘటనలపై కూడా స్పంధించాల్సి బాధ్యత ఉంది. దయచేసి ఈ విషయాన్ని హైలెట్ చేసి చూపించాలి. వాడి ఫోటోలు రిలీజ్ చేసి జల్లెడ పట్టండి. ఎక్కడున్నా పోలీసులకు అప్పగించాలి అని మనోజ్ తన ఆవేదనను తెలియజేశాడు. అంతేకాకుండా మనోజ్ బాధితురాలి తండ్రికి కూడా భరోసా ఇచ్చే విధంగా మద్దతు ఇచ్చాడు.

    నువ్వు ఎంతగా బాధపడుతున్నావు నాకు తెలుసు అన్నా. నీ లోటు తీర్చలేనిది. ఒక కుటుంబ సభ్యులుగా మేము అందరం నీకు తోడుగా ఉన్నాము. తప్పకుండా న్యాయం జరిగే వరకు కూడా ఎవరు నిద్రపోము అని కూడా మంచు మనోజ్ తెలియజేశాడు.

    English summary
    Manchu manoj fire on media emotional comments on saidabad girl incident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X