Manoj Mounika: మంచు మనోజ్ రెండో పెళ్లి తేది ఫిక్స్.. వచ్చే వారంలోనే! ఎవరీ నాగ మౌనిక?
మంచి మనోజ్ బడా సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనదైన మేనరిజం, స్టైల్, నటనతో ఆకట్టుకున్నాడు. దొంగ దొంగది సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు. అయితే మంచు విష్ణు గానీ, మంచు మనోజ్ గానీ మోహన్ బాబు రేంజ్ లో గుర్తింపు, సక్సెస్ అందుకోలేకపోయారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ పర్సనల్ విషయాలపై అనేక రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మనోజ్ రెండో పెళ్లి తేది ఫిక్స్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

బాల నటుడిగా..
బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన మంచు మనోజ్ మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నాదేశం, అడవిలో అన్న, ఖైదీగారు చిత్రాల్లో అలరించాడు. తర్వాత హీరోగా దొంగ దొంగది, శ్రీ, రాజు భాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, కరెంట్ తీగ, పాండవులు పాండవులు తుమ్మెద, పోటుగాడు, ఎటాక్, గుంటూరోడు లవ్ లో పడ్డాడు, ఒక్కడు మిగిలాడు వంటి చిత్రాలలో నటించాడు.

2019లో విడాకులు..
సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో హీరోగా ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూశాడు మంచు మనోజ్. ఈ పరిస్థితుల్లోనే తన చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో చాలా కాలం ప్రేమాయణం సాగించి.. 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న మంచు మనోజ్ కాపురం సజావుగా సాగలేదు. వీళ్లిద్దరికీ చాలా మనస్ఫర్థలు వచ్చాయి. ఈ కారణంగానే భార్య ప్రణతితో 2019లో విడాకులు తీసుకున్నాడు.

రెండో పెళ్లిపై పుకార్లు..
తన విడాకుల గురించి సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించిన మంచు మనోజ్ మళ్లీ సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని కూడా తెలిపాడు. అయితే మంచు మనోజ్ పర్సనల్ విషయాల గురించి గత కొంతకాలంగా అనేక పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా మనోజ్ రెండో పెళ్లి గురించి రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో అతని పెళ్లి జరగబోతున్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి.

వ్యక్తిగత విషయం అంటూ..
మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి గతేడాది సెప్టెంబర్ తొలివారంలో హైదరాబాద్ సీతాఫల్ మండిలోని వినాయక మండపంలో జంటగా కనిపించారు. అప్పుడు గణనాథుడిగా పూజలు నిర్వహించారు. అప్పుడే వీళ్లు ప్రేమించుకుంటున్నారనే వార్తలు జోరు అందుకున్నాయి. అప్పటి నుంచి ఈ వార్తలకు ప్రాణం పోసినట్లయింది. అప్పుడు పెళ్లి గురించి ప్రస్తావించగా.. అది తన వ్యక్తిగత విషయం అని చెప్పాడు మంచు మనోజ్.

మార్చి తొలి వారంలో..
గతేడాది డిసెంబర్ లో కడప దర్గాను సందర్శించిన మనోజ్ కొత్త జీవితం ప్రారభించనున్నట్లు, త్వరలో కొత్త కుటుంబ సభ్యులతో దర్గాకు రావాలని ఉన్నట్లు మంచు మనోజ్ తెలిపాడు. అప్పుడే మనోజ్, మౌనిక పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టత వచ్చినట్లు అయింది. అయితే మార్చి తొలి వారంలో అది కూడా మార్చి 3న మంచు మనోజ్ భూమా నాగ మౌనిక పెళ్లి చేసుకోనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. వీళ్లిద్దరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మౌనికకు కూడా రెండో పెళ్లి..
అయితే మనోజ్, మౌనిక పెళ్లిపై ఇరు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను మంచు లక్ష్మీ నిర్వహించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. రాయలసీమలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న భూమా నాగి రెడ్డి, శోభా రెడ్డి దంపతులకు రెండో కుమార్తె నాగ మౌనిక. తల్లిదండ్రుల మరణం తర్వాత వాళ్ల మొదటి కుమార్తె అఖిల ప్రియ రాజకీయాల్లోకి వచ్చింది. అక్కకు అండగా నిలుస్తూ నియోజకవర్గంలో కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉంటున్న మౌనికకు కూడా ఇది రెండో పెళ్లి.


Click it and Unblock the Notifications











