ఇదెక్కడి సిత్రం... మంచు మనోజ్ అడ్రస్ మారిపోయిందిగా!

సినీ నటుడు మంచు మనోజ్ అడ్రస్ మారిపోయింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో నివాసం ఉండే మనోజ్ సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీలో ఓటరుగా మారిపోయారు. వందలాది మంది నారాయణ్ ఖేడ్ ఓటర్ల లిస్టులో ఆయన కూడా ఓటరుగా ఉన్నారు. మంచు మనోజ్.. సన్నాఫ్ మోహన్ బాబు అని అందులో ఉంది.

కొంపతీసి ఆయన త్వరలో జరుగబోయే మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లాంటివి ఏమైనా చేస్తున్నారా? అనే డౌట్ మాత్రం వద్దు. ఇదంతా మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో వెలుగు చూస్తున్న సిత్రాలు. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు జరిగిన సంగతి తెలిసిందే.

Manchu Manoj Name in Sangareddy Voter list

కాగా... మంచు మనోజ్ ఈ మధ్య సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేశాడు. తిరుపతి కేంద్రంగా ప్రజాసేవ చేస్తూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు గతంలో ఆయన ఆయన లేఖ స్పష్టం చేస్తోంది. సేవా మార్గంలో యువ నాయకుడిగా ఎదిగి క్రమక్రమంగా రాజకీయల వైపు వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మంచు మనోజ్ నటించిన చివరి చిత్రం 'ఒక్కడు మిగిలాడు' 2017లో విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద విజయం అందుకోలేదు. అంతకు ముందు చేసిన గుంటూరోడు, శౌర్య చిత్రాలు కూడా నిరాశనే మిగిల్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X