twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు: తిరుపతి ర్యాలీపై మంచు మనోజ్ ఓపెన్ ఛాలెంజ్

    |

    ఫీజు రీఎంబర్స్మెంట్ ఇష్యూపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రముఖ నటుడు మోహన్ బాబు తిరుపతిలో తన శ్రీ విద్యానికేతన్ విద్యార్థులతో ర్యాలీ తీయడం సంచలనం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది పొలిటికల్ స్టంట్ అంటూ తెలుగు దేశం పార్టీ వారు ఎదురు దాడి ప్రారంభించారు. కుటుంబ రావు అనే వ్యక్తి మోహన్ బాబు చేసిన ఈ ధర్నాపై విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మీద బురద జల్లేందుకు, ఎన్నికల్లో జగన్‌కు లబ్ది కలిగేలా చేయాలనే ఉద్దేశ్యంతో ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ రావు ఆరోపణలపై మంచు మనోజ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. బహిరంగ లేఖ సంధించారు.

    ఆ పెద్ద మనిషి నారా కుటుంబం తరుపున వకాల్తా పుచ్చుకున్నాడు

    ఆ పెద్ద మనిషి నారా కుటుంబం తరుపున వకాల్తా పుచ్చుకున్నాడు

    ప్రియమైన ఆంధ్రులకు, మా నాన్న మోహన్ బాబు గారు కాలేజీ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ విషయమై మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడమైనది. అవి నిజాలు కావని, అసత్యాలని కుటుంబరావు అనే ఒక పెద్దమనిషి ఆంధ్రప్రదేశ్ ప్రజల కుటుంబం తరుపున కాకుండా కేవలం నారా కుటుంబం తరుపున వకాల్తా పుచ్చుకుని చాలా గొప్పగా మాట్లాడినట్లు ఫీలవుతున్నాడు అంటూ... మంచు మనోజ్ ఫైర్ అయ్యారు.

    డబ్బు ఇస్తామని ఇవ్వలేదు

    డబ్బు ఇస్తామని ఇవ్వలేదు

    అయ్యా పెద్దమనిషీ 05.02.2019 తేదీన ఐఏఎస్ రావత్ గారికి మా కాలేజీకి ఎంత అమౌంట్ రావాలో లేఖ ద్వారా అందజేసాం. ఒక్కవారంలో పంపుతామని మా తరుపున లేఖ అందజేసిన మనిషికి చెప్పి, ఈ విషయం మోహన్ బాబు గారికి తెలియజేయమన్నారు. కానీ చెప్పిన ఆయా తేదీలలో మాకు రావాల్సిన బకాయిలు రానందున కళాశాలలో 02.03.2019 తేదీన మీటింగ్ పెట్టి మాకు డబ్బులు అందలేదు అని చెప్పడం జరిగింది. దానికి సమాధానం రానందున ఈ రోజు 22.03.2019 తేదీన మీడియా చెప్పడం జరిగింది... అని మనోజ్ తెలిపారు.

    తప్పు అని నిరూపించండి

    అయ్యా పెద్ద మనిషీ.. మేము చెప్పిన అమౌంట్ తప్పు అని నువ్వు చెబుతున్నావు. అందులో వెయ్యి రూపాయలు తప్పు అని నిరూపించినా మాకు అందవలసిన టోటల్ ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం మాకు ఇవ్వనక్కర్లేదు అని మా నాన్నగారు తెలియజేస్తున్నారు.

    ఎవడి సొమ్ము అది, అహంకారం పనికిరాదు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ మోహన్ బాబు!ఎవడి సొమ్ము అది, అహంకారం పనికిరాదు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ మోహన్ బాబు!

    డబ్బాలు కొట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం

    డబ్బాలు కొట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం

    అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే జ్ఞానభూమి స్కాలర్షిప్ స్టేట్మెంట్ 2018-19 అని ఒక కరపత్రం విద్యార్థులకు అందజేశారు. దానిలో మూడవ విడత ఫీజు రీఎంబర్మ్సెంట్ ఫిబ్రవరి మాసంలో అందజేయబడుతుందని అన్నారు. అయ్యా మహాశయా.. బాగా విను. మొదటి వడత బ్యాలెన్స్ ఉంది. రెండవ వీడత పూర్తిగా రాలేదు. అది ఇవ్వకపోగా మూడవ విడత ఫిబ్రవరిలో ఇస్తామని డబ్బాలుకొట్టుకున్నారు. విద్యార్థులకు కరపత్రాలు కూడా పంపారు. ఇది ఇప్పటి ప్రభుత్వం తీరు అంటూ మనోజ్ విమర్శించారు.

    ఆ విషయం దాట వేశారు

    ఆ విషయం దాట వేశారు

    మా విద్యా సంస్థలకు 2017-18 సంవత్సరంలో బ్యాలెన్స్ రెండు కోట్ల పదహారు లక్షలు ఇవ్వాలి. అది కూడా కుటుంబ రావు చెప్పకుండా దాటవేశాడు. ఈ కాలేజీ పెట్టింది ఎప్పుడు? ఎప్పటి నుంచి మా నాన్నగారు 25శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ కుల మతాలకు అతీతంగా అందిస్తున్నారు? మా విద్యానికేతన్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తాం. తెలుసుకో... నోరు విప్పే ముందు కళ్లు విప్పి చూడు... అంటూ కుటుంబరావుపై మనోజ్ విరుచుకుపడ్డారు.

    అది మా నాన్నగారు కష్టపడి సంపాదించిన డబ్బు, మనోజ్ ఓపెన్ ఛాలెంజ్

    అది మా నాన్నగారు కష్టపడి సంపాదించిన డబ్బు, మనోజ్ ఓపెన్ ఛాలెంజ్

    25 శాతం మీరిచ్చే డబ్బులతో కాదు.. మా నాన్న గారు నటుడిగా సంపాదించిన డబ్బులతో అనే నిజాన్ని కుటుంబ రావు తెలుసుకోవాలి. అనుమానం ఉంటే ఇన్కమ్ టాక్స్ ఫైల్స్ చెక్ చేసుకో. ఇది ఓపెన్ ఛాలెంజ్... అంటూ మనోజ్ తన లేఖలో పేర్కొన్నారు.

    అడ్డదారిలో వచ్చిన డబ్బు కాదు

    అడ్డదారిలో వచ్చిన డబ్బు కాదు

    ఇది అడ్డదారిలో వచ్చిన డబ్బు కాదు. ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బు అంతకన్నా కాదు. ఒక కళాకారుడు ప్రేక్షకులను అలరించి నిజాయితీగా సంపాదించిన డబ్బు అని కుటుంబరావు గుర్తు పెట్టుకోవాలి.

    ఏ పార్టీకి మద్దతు కాదు, టిక్కెట్ అడగలేదు

    ఏ పార్టీకి మద్దతు కాదు, టిక్కెట్ అడగలేదు

    ఒక పార్టీ తరుపున మేము మాట్లాడుతున్నామని, పార్టీ టిక్కెట్లు అడిగామని లేని పోని నిందలు వేస్తున్నారు. నేను కానీ మా అక్కకానీ రాజకీయ పార్టీ టిక్కెట్లు కాదు కదా సినిమా టిక్కెట్లు కూడా అడగలేదు. ఇది నిజం... అని మనోజ్ తెలిపారు.

    English summary
    Manchu Manoj open letter on fee reimbursement issue. "For all the people who are questioning about the timing of our dharna...We tried our best to convey our govt through IAS Officer Mr.Rawat and through press before but no reply...The letter delivers all your answers. 🙏🏻 #Kutumbarao garu, next Cover up enti?! Waiting Sir." Manchu Manoj tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X