ఫారెన్ పిల్లతో రెండో పెళ్లి.. ఓపెన్ అయిన మంచు మనోజ్.. ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల అంటూ!

మామూలుగానే సెలబ్రిటీల జీవితం గురించి సాధారణ ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే వార్తలు లేనపుడల్లా ఏదో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన పర్సనల్ లైఫ్ గురించి మీడియా సంస్థలు, సోషల్ మీడియా వెబ్ సైట్స్ ఏదో ఒక కథనం వెలువరించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. అలాగే తాజాగా మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి ఒక వెబ్ సైట్ కథనం రాయగా దాని మీద మంచు మనోజ్ ఆసక్తికరంగా స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే

ప్రేమ పెళ్లి

ప్రేమ పెళ్లి

మంచు మోహన్ బాబు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు మనోజ్ హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు. హీరో గా చాలా సినిమాలు చేశాడు గాని ఆయనకు సరైన మార్కెట్ అయితే ఇప్పటికీ ఏర్పడలేదు. తన అన్న పెళ్లి జరిగిన సమయంలో ప్రణతి రెడ్డి అనే యువతి తో ప్రేమలో పడిన మంచు మనోజ్ 2015లో ఆమెను వివాహం చేసుకున్నాడు.

విడిపోయామని,

విడిపోయామని,

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ గత ఏడాది తాము విడిపోయామని, విడాకులు తీసుకున్నామని మంచు మనోజ్ అధికారికంగా ప్రకటించాడు. అయితే మనోజ్ పెద్ద స్టార్ కాకపోవడంతో వీరి విడాకుల గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు తాజాగా సమంత విడాకుల తర్వాత మళ్ళీ విడాకులు తీసుకున్న అందరి గురించి ఏదో ఒక కథనం రాయడం పరిపాటిగా మారిపోయింది.

ఫారెన్ అమ్మాయిని

ఫారెన్ అమ్మాయిని

అదేవిధంగా తెలుగు లో ఒక వెబ్సైట్ మంచు మనోజ్ ఒక ఫారెన్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని అయితే మోహన్ బాబుకు మాత్రం అది ఇష్టం లేదని అందుకే బంధువులలో ఒక పిల్లను చూసి పెళ్లి చేయడానికి సిద్ధం అవుతున్నారని చెబుతూ ఊహాజనితంగా ఒక కథనాన్ని రాసుకొచ్చింది. అయితే ఈ వ్యవహారం మీద ఎలా స్పందించాలో అర్థం కాని మంచు మనోజ్ పెళ్ళికి నన్ను కూడా పిలవండి, పెళ్లి ఎక్కడ జరుగుతుంది? అలాగే బుజ్జి పిల్ల తెల్ల పిల్ల ఎవరు? అంటూ ఫన్నీగా ప్రశ్నించాడు.

మీ ఇష్టం అంతా మీ ఇష్టం


అంతేకాక బ్రహ్మానందం ఫన్నీ ఎక్స్ప్రెషన్ లో ఉన్న ఒక ఫోటో షేర్ చేసి మీ ఇష్టం అంతా మీ ఇష్టం అంటూ కామెంట్ చేశాడు. అయితే మంచు మనోజ్ స్పందన ఫన్నీ గానే ఉన్నా అసలు ఏమీ లేని చోట ఏదో జరిగిపోతోంది అనుకుంటూ ఇలా కథనాలు వెలువరించడం మాత్రం తప్పని చెప్పాలి..

Recommended Video

MAA Elections: జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడులో CM అవ్వలేదా.. క‌ళ‌కు ప్రాంత‌మేంటి ? Jeevitha
రీ ఎంట్రీ

రీ ఎంట్రీ

ఇక మంచు మనోజ్ ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి అనే సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం కూడా ఆసక్తికరంగా మారింది. మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల లో పాల్గొనడం ఆ తర్వాత మాటల యుద్ధం జరగడంతో మంచు మనోజ్ వెళ్లి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. మంచు మనోజ్ నటిస్తున్న అహం బ్రహ్మాస్మి సినిమాలో అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది కానీ దానికి సంబంధించి క్లారిటీ అయితే లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X