‘నెపోటిజం పేరుతో దారుణంగా ఏడ్పించారు.. నాన్న సినిమా రిలీజైతే నరకమే’
టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ చాలా గ్యాప్ తర్వాత తిరిగి సినిమాలతో బిజీ అయ్యారు. రీసెంట్ గానే 'భైరవం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన నటనతో దుమ్మురేపారు. ఏకంగా తన తండ్రి మోహన్ బాబు గారిని వెండితెరపై గుర్తు చేసి అదరగొట్టాడు. మొత్తానికి మంచు మనోజ్ కంబ్యాక్ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మనోజ్ లైనప్ లోనూ వరుస చిత్రాలు ఉండటంతో తన ఫ్యాన్స్, ఆడియెన్స్ కు దగ్గరగా ఉండేందుకు మనోజ్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకు బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంర్వ్యూలో మనోజ్ నెపోటిజం గురించి మాట్లాడారు. ఆ పేరుతో తనను చాలా మంది ఏడిపించారని, చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
భైరవంతో మంచు మనోజ్ కంబ్యాక్..
మంచు మోహన్ బాబు కొడుకుగా మంచు మనోజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆయన కెరీయర్ లో మంచిమంచి సినిమాలు చేశారు. ప్రేక్షకులకు గుర్తుండి పోయే పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. అంతకు ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా అరడజన్ చిత్రాల్లో నటించి అదరగొట్టారు. ఇక 2004లో దొంగ దొంగది చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. శ్రీ, రాజు బాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, పోటుగాడు, కరెంట్ తీగ, గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. 2018 వరకు వరసుగా సినిమాలు చేశారు. ఆ తర్వాత గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ మే30న 'భైరవం' చిత్రంతో కంబ్యాక్ ఇచ్చారు. 8 ఏళ్లకు తిరిగి వెండితెరపై కనిపించారు.

నెపోటిజంపై ఇలా..
భైరవం చిత్రం విడుదల తర్వాత మనోజ్ పేరు మారుమోగింది. అంతకు ముందు మంచు ఫ్యామిలీలో గొడవల కారణంగా ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. ఇక 'భైరవం' చిత్రంతో సాలిడ్ కాంబ్యాక్ ఇవ్వడంతో ఇంకాస్తా గట్టిగా వినిపించింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజంపై మంచు మనోజ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'నెపోటిజం వల్ల నేను చాలా బాధపడ్డాను. బంధుప్రీతి అనేది ఏ నటుడికైనా ఒకటి, రెండు సినిమాల వరకు పనిచేస్తుంది ఆ తర్వాత టాలెంట్ మాత్రమే బతికిస్తుంది. కానీ నెపోటిజం వల్ల నన్ను స్కూల్ లో చాలా ఏడిపించే వారు. మీ నాన్న హీరో, మీ నాన్న బిజినెస్ మెన్ అని ప్రతి దానికి టార్గెట్ చేస్తూ ఉండే వారు. అలా నెపోటిజం వల్ల స్టార్ కిడ్స్ కు సమస్యలు కూడా ఉంటాయి. అవన్నీ తట్టుకోగలిగే శక్తి కూడా ఉండాలి.' అని చెప్పుకొచ్చారు.
నాన్న మోహన్ బాబు సినిమాలొస్తే..
అలాగే నెపోటిజం పేరుతో దారుణంగా ఏడిపించే వారని మంచు మనోజ్ చెప్పారు. ఇక తన తండ్రి మంచు మోహన్ బాబు సినిమాలు విడుదలై వాటి ఫలితాలు కాస్తా తేడా కొడితే ఇంకా ఆడేసుకునే వారని చెప్పారు. అలా చాలా బాధ కలిగించిన సంఘటనలు ఉన్నాయని చెప్పారు. అలాగే ఏ పరిశ్రమలోనైనా, ఏ తండ్రి అయినా ఆయన చేసే వ్యాపారం గురించి, పని గురించి తప్పకుండా కొడుకుకు చెబుతూ ఉంటాడు.
తండ్రితోనే ఉండటం వల్ల ఆ పిల్లాడు కూడా అందులో మెళకువలు నేర్చుకుంటాడు. ఆ ఫీల్డ్ పైనా ఆసక్తి చూపించడం అనేది సహజంగా జరుగుతుందని చెప్పారు. అలాగే తను కూడా చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణంలో ఉండటం, చైల్డ్ ఆర్టిస్ట్ గానూ నటించడం, తండ్రి వారసత్వంగా సినిమాల్లోకి రావడం తప్పేమీ కాదు కదా అని అన్నారు. ప్రస్తుతం సినిమాలు తప్పా మరేమీ చేయలేనని, ఇంకే పని రాదని చెప్పుకొచ్చారు. ఇక మనోజ్ నెక్ట్స్ రక్షక్, వాట్ ది ఫిష్ అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


Click it and Unblock the Notifications











