మంచు మనోజ్, మౌనిక దంపతులకు పుట్టబోయేది కవలలా.. క్లారిటీ ఇచ్చిన హీరో!
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈయన గతేడాది భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ రెండో ఇది రెండో పెళ్లే కాగా.. ఈ వార్త సెన్సేషన్ క్రియేటే చేసింది. అయితే ముందుగా వీరి పెళ్లికి మంచు ఫ్యామిలీ ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత అక్క మంచు లక్ష్మి సాయంతో ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు మనోజ్.
మౌనికకు ముందే ఓ కొడుకు ఉండగా.. మంచు విష్ణు అతడిని తన కొడుకుగా పెంచుతున్నాడు. శివుడికి వినాయకుడు దొరికినట్లు తనకు ధైరవ్ దొరికాడంటూ వివరించిన ఆయన భార్య, కొడుకుతో కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే పెళ్లై ఏడాది కూడా కాకముందే మౌనిక గర్భం దాల్చడంతో వీరు ఫుల్ సంతోషంలో ఉన్నారు. వీరికి కవల పిల్లలు పుట్టబోతున్నారంటూ చాలా కాలంగా వస్తున్న వార్తలపై మనోజ్ స్పందించాడు. అసలు విషయం చెప్పాడు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిలు పెళ్లైనప్పటి నుంచి హాయిగా జీవిస్తున్నారు. చాలా హాయిగా సాగుతున్న వీరి కాపురంలోకి మరో పాపో, బాబో రాబోతున్నారు. ఏడాది తిరక్కముందే మౌనిక గర్భవతి అయింది. కొన్ని నెలల క్రితం మనోజ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. తాజాగా మౌనిక కూడా తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది. ఇక అప్పటి నుంచి ఆమె గర్భంపై అనేక వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె కవల పిల్లలకు జన్మను ఇవ్వబోతుందంటూ చెప్పుకొస్తున్నారు.
అయితే ఈ వార్తలపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ఎక్స్ వేధికగా ఓ లేఖను విడుదల చేశారు. అనుక్షణం అభిమానులు తమపై చూపిస్తున్న ప్రేమకు తమ హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. తన భార్య ప్రస్తుతం ఏడవ నెల గర్భవతి అని... భగవంతుని ఆశీస్సులతో ఈ క్షణం వరకు తను ఆరోగ్యంగా సురక్షితంగా ఉందని వెల్లడించారు. అలాగే మరికొన్ని రోజుల్లోనే తమ జీవితాల్లోకి రానున్న బిడ్డల పట్ల ఎంతో ఆశగా ఆసక్తితో ఎదురు చూస్తున్నామని వివరించారు.
అయితే ఒక విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాననంటూ నోట్ రాసుకొచ్చారు. కవల పిల్లల విషయంలో బయట వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని... ఆ సమయం, సందర్భం వచ్చినప్పుడు తామే నేరుగా ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటామని అన్నారు. తమ ప్రమేయం లేకుండా బయట వస్తున్న వార్తలును పట్టించుకోవద్దని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











