మంచు మనోజ్ మరో కీలక నిర్ణయం.. రెండో పెళ్లిపై అఫీషియల్ క్లారిటీ.. ఆ అమ్మాయితోనే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోలలో మంచి మనోజ్ ఒకరు. మంచు విష్ణు తర్వాత అన్నయ్య బాటలోనే మనోజ్ కూడా కొంతకాలం పాటు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. అయితే మోహన్ బాబు రేంజ్ లో అయితే వీరు సక్సెస్ కాలేకపోయారు. ఇక మనోజ్ అయితే కొంతకాలం పర్సనల్ లైఫ్ లో కూడా చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు అతను తన జీవితంలో ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ విషయంలో అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాడు. లేటెస్ట్ గా మంచు మనోజ్ ఏం చెప్పాడు అనే వివరాల్లోకి వెళితే..

మొదట్లో సక్సెస్
మంచు మనోజ్ మంచి టాలెంటెడ్ హీరో. మొదట్లో అతను కొన్ని డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునేవాడు. ముఖ్యంగా అతని కెరీర్లో బిందాస్ పోటుగాడు సినిమాలకు మంచి క్రేజ్ వచ్చింది. నటుడిగా కూడా వేదం లాంటి సినిమాలతో అతను విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. కానీ గత కొన్నాళ్ళు గా మంచు మనోజ్ కు వరుస ఫ్లాప్స్ రావడంతో ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఇచ్చాడు.

బౌన్స్ బ్యాక్ అవ్వాలని..
ఇక మంచు మనోజ్ ఆ మధ్యకాలంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అహం బ్రహ్మాస్మి అనే ఒక భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ఇక మనోజ్ మళ్లీ బౌన్స్ బ్యాక్ ఇవ్వబోతున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ రోజులు గడుస్తున్నా ఇంకా ఆ ప్రాజెక్టు గురించి మనోజ్ ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వడం లేదు.

విబేధాలు రావడంతో..
ఇక పర్సనల్ లైఫ్ లో కూడా చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతను మొదటి భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కొన్ని విభేదాలు రావడంతో మనోజ్ కొంతకాలం దూరం ఉన్న తర్వాత 2019లో విడాకులు తీసుకున్నాడు. ఆ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో అధికారికంగా తెలియజేసిన మనోజ్ మళ్లీ సరికొత్త జీవితాన్ని మొదలు పెడతాను అని కూడా వివరణ అయితే ఇచ్చాడు.

మనోజ్ ట్వీట్ వైరల్
ఇక రీసెంట్ గా మంచు మనోజ్ మరోసారి ట్విట్టర్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. చాలా కాలంగా మనసులో ఒక విషయాన్ని దాచుకున్నాను. ఇక నా లైఫ్ లో నేను మరో దశలోకి ప్రవేశించడానికి సంతోషిస్తున్నాను. ఫైనల్ గా అతి ముఖ్యమైన విషయాన్ని జనవరి 20వ తేదీన ప్రకటిస్తాను.. అంటూ మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని కూడా అతను అందులో మెన్షన్ చేశాడు.
ఆమెతో రెండో పెళ్లి?
అయితే మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి కూడా చాలా కాలంగా కొన్ని గాసిప్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో అతని పెళ్లి జరగబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఆమధ్య భూమా మౌనికతో కలిసి మనోజ్ ఒక వినాయక పూజలో కూడా పాల్గొన్నాడు. అయితే ఇంతవరకు ఆ విషయంలో ఎవరు కూడా అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. బహుశా మనోజ్ ఇప్పుడు అదే విషయంలో క్లారిటీ ఇవ్వవచ్చు అని టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











