For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Manchu Manoj రెండో పెళ్లి.. కాబోయే శ్రీమతితో పూజలు.. ఎవరీ మౌనికారెడ్డి?

  |

  బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో హీరోగా పరిచయం అయినప్పటికీ.. తనలోని ఎన్నో టాలెంట్లను బయటకు తీసుకొచ్చి ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు మంచు వారి అబ్బాయి మనోజ్. కెరీర్ ఆరంభం నుంచి విలక్షణమైన నటనతో పాటు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచిన అతడు.. సుదీర్ఘమైన కెరీర్‌లో మాత్రం పెద్దగా సక్సెస్‌ను సొంతం చేసుకోలేకపోయాడు. అదే సమయంలో వైవాహిక జీవితంలోనూ కష్టాలను అనుభవించాడు. తద్వారా భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడు భూమా మౌనిక రెడ్డితో కలిసి కనిపించడంతో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మనోజ్ దీనిపై ఏమని స్పందించాడో మీరే చూడండి!

   హీరోగా ఎత్తుపల్లాలు.. ఆమెతో వివాహం

  హీరోగా ఎత్తుపల్లాలు.. ఆమెతో వివాహం

  మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్.. సుదీర్ఘమైన కెరీర్‌లో హీరోగా ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూశాడు. ఈ పరిస్థితుల్లోనే తన చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో చాలా కాలం ప్రేమాయణం సాగించాడు. ఆ తర్వాత వీళ్లిద్దరూ 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా సాగిన విషయం తెలిసిందే.

  హాట్ షోలో హద్దు దాటిన జబర్ధస్త్ రీతూ చౌదరి: తొలిసారి బికినీలో అందాల ఆరబోత

  మనస్ఫర్థలు.. భార్యకు విడాకులిచ్చేసి

  మనస్ఫర్థలు.. భార్యకు విడాకులిచ్చేసి

  ప్రేమ వివాహమే చేసుకున్నప్పటికీ భార్య ప్రణతితో మంచు మనోజ్ కాపురం సజావుగా సాగలేదు. వీళ్లిద్దరికీ చాలా మనస్ఫర్థలు వచ్చాయి. ఈ కారణంగానే ఆమెతో విడాకులు తీసుకుంటున్నానని కొన్నేళ్ల క్రితం మంచు మనోజ్ ప్రకటించాడు. సోషల్ మీడియాలో సుదీర్ఘమైన లేఖను వదిలిన అతడు.. చాలా విషయాలు వెల్లడించాడు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద సంచలనం అయింది.

  సినిమాల్లోకి రీఎంట్రీ... అదే పనిలోనే

  సినిమాల్లోకి రీఎంట్రీ... అదే పనిలోనే

  వైవాహిక జీవితంలో ఇబ్బందుల కారణంగా సినిమాలకు దూరమైన మంచు మనోజ్.. గత ఏడాది 'అహం బ్రహ్మాస్మి' అనే కొత్త తరహా చిత్రాన్ని ప్రకటించాడు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ఎమ్ ఆర్ట్స్ పతాకంపై మంచు ఫ్యామిలీలోని వాళ్లంతా స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది.

  సరయు రాయ్ ఎద అందాల జాతర: చీర కొంగును పక్కకు జరిపి మరీ!

  మంచు మనోజ్ రెండో పెళ్లిపై పుకార్లు

  మంచు మనోజ్ రెండో పెళ్లిపై పుకార్లు

  విడాకులు తీసుకున్న తర్వాత మంచు మనోజ్ మరో వివాహం చేసుకోబోతున్నాడని ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు అన్ని మీడియా సంస్థల్లో ఈ వార్త హైలైట్ అవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఫలితంగా ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశం అవడంతో ఇది అతడి దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఇదంతా అవాస్తవం అని అతడు చెప్పాడు.

  భూమా మౌనికా రెడ్డితో మనోజ్ పూజ

  భూమా మౌనికా రెడ్డితో మనోజ్ పూజ

  మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతోన్న సమయంలోనే తాజాగా అతడు చేసిన పని సెన్సేషన్ అవుతోంది. ఆదివారం సాయంత్రం ఈ యంగ్ హీరో హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండి దగ్గర ఏర్పాటు చేసిన వినాయక మండపానికి మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనిక రెడ్డితో కలిసి వచ్చాడు. తర్వాత అక్కడ పూజలు చేశాడు.

  JGM: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు మరో షాక్.. జనగణమనపై పూరీ జగన్నాథ్ సంచలన నిర్ణయం

  వీళ్లిద్దరికీ పెళ్లి జరుగుతుందని టాక్

  వీళ్లిద్దరికీ పెళ్లి జరుగుతుందని టాక్

  భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ కలిసి పూజలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే ఇప్పుడు కలిసి పూజలు చేశారని అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనికితోడు మనోజ్‌ను దీనిపై ప్రశ్నించగా.. 'మంచిరోజు చూసుకుని చెప్తా' అని చెప్పి మరిన్ని డౌట్లు పెంచేశాడు.

  మనోజ్.. మౌనిక.. ఇద్దరికీ విడాకులు

  మనోజ్.. మౌనిక.. ఇద్దరికీ విడాకులు

  మంచు మనోజ్ గతంలో తన భార్యకు విడాకులు ఇచ్చినట్లుగానే.. మౌనిక రెడ్డి కూడా తన భర్తతో విడిపోయారు. అలా చాలా రోజులుగా ఒంటరిగా ఉంటోన్న వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇక, మౌనిక.. భూమా నాగిరెడ్డి - శోభారెడ్డి దంపతుల కుమార్తె. ఈమె సోదరి అఖిల ప్రియ గత ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పని చేశారు.

  English summary
  Tollywood Hero Manchu Manoj Spotted with Bhuma Mounika Reddy at Ganesh Pooja. This Was Gone Hot topic in Movie and Political Circles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X