twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Manchu Manoj : వాళ్ళని ఎన్ కౌంటర్ చేయండి.. టాలీవుడ్ నుంచి ఆ కుటుంబానికి అండగా!

    |

    హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో వెలుగులోకి వచ్చిన దారుణ రేప్ అండ్ మర్డర్ కేసు సంచలనంగా మారింది. ఆరేళ్ల పాప మీద ఒక దుర్మార్గుడు అకృత్యానికి ఒడిగట్టాడు, ముక్కు పచ్చలారని చిన్నారిని రేప్ చేసి చంపేశాడు. ఈ అంశం మీద ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనంగా మారగా టాలీవుడ్ నుంచి హరీష్ శంకర్ మంచు మనోజ్ ఈ అంశం గురించి స్పందించారు. మంచు మనోజ్ అయితే ఏకంగా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    నడిబొడ్డున దారుణం

    నడిబొడ్డున దారుణం

    హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే రాజు (30) అనే ఆటో డ్రైవర్ తన ఇంటి పక్కన నివాసం ఉండే ఒక చిన్నారిని రేప్ చేసి చంపేశాడు. అతడిని తమకు అప్పగించే వరకూ పాప మృతదేహాన్ని కదిలించేది లేదని బస్తీ వాసులు ఆరోజునే ఆందోళనకు దిగారు. సింగరేణి కాలనీలో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు, రాత్రయ్యే వరకు పాప ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే రాజుపై అనుమానం వచ్చింది.

    తలుపులు పగల కొట్టగా

    తలుపులు పగల కొట్టగా

    నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో వారితో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో ఏడు గంటల సమయం నుంచి అతని ఇంటి తలుపు పగలగొట్టి చూడమని అడుగుతూ వచ్చినా పోలీసులు అందుకు ఒప్పుకోలేదు, చివరికి అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది.

    పాపం పసిపాప

    పాపం పసిపాప

    సాయంత్రం వరకు చిరు నవ్వులు చిందిస్తూ గణేష్ మండపం వద్ద సందడి చేసిన ఆ చిన్నారి ఓ కిరాతకుడి కామ దాహానికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ ఘటన విషయంలో స్థానికులుకు పోలీసులకు మధ్య వివాదం కూడా నడించింది. పోలీసులకు స్థానికులకు గాయాలు కూడా అయ్యాయి. నిందితుడు రాజును తమకు అప్పగించే వరకూ పాప మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేది లేదని బస్తీవాసులంతా నిరసనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. కానీ అతను ఇప్పటి దాకా దొరకలేదు.

    సజ్జనార్ సార్ మళ్లీ రావాలి

    సజ్జనార్ సార్ మళ్లీ రావాలి

    దీంతో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటి దాకా హరీష్ శంకర్ స్పందించారు. టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ సజ్జనార్ సార్ మళ్లీ రావాలి. తక్షణ సహాయం ఎంతో అవసరమని అన్నారు. లేకపోతే కనుక ఇలాంటి దాడులు ఆగవంటూ ఆయన తెలిపారు. ఇలాంటి వార్తలు వ్యాప్తి చేయాలని నేను అనుకోవట్లేదు, కానీ ఇలాంటి వార్తల ద్వారా స్పూర్తి పొందె దిక్కుమాలిన వ్యక్తులున్నారని అని ఆవేదన వెలిబుచ్చారు.,

    మంచు మనోజ్ అండగా

    మంచు మనోజ్ అండగా

    ఇక ఇదే అంశం మీద మంచు మనోజ్ మాట్లాడుతూ ఈ ప్రపంచం ఏమిటి ??? ఇది చాలా హృదయ విదారకం !!! ఆ దుష్ట నమూనాను వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని అధికారులను అభ్యర్థిస్తున్నాను .. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి! ఇది తెలిసిన తర్వాత ఎంత బాధాకరమైనదో కూడా చెప్పలేను, చిట్టి తల్లికి విశ్రాంతి అంటూ ఆయన ట్వీట్ చేశారు . అంతే కాక ఆయన ఏకంగా ఈరోజు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నారు. కొంత ఆర్ధిక సాయం చేసి టాలీవుడ్ అంతా మీకు అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారని అంటున్నారు.

    Recommended Video

    MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
    పవన్ రావాలి

    పవన్ రావాలి

    అయితే నిన్న పాప బంధువులు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కనుక ఈ విషయం గురించి మాట్లాడితే మా బాధ ఎన్నో వేల మందికి చేరే అవకాశం ఉంటుందని అన్నారు. ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కి గురై హాస్పిటల్లో ఉన్న సంగతి తమకు తెలుసని తమ సమస్య కూడా పట్టించుకుని ఆయన ప్రపంచం దృష్టికి తీసుకు వెళితే తమ పాపకి న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గిరిజన పేరుతో సినిమా చేస్తున్నారని అలాంటి గిరిజనులకు సహాయం చేసినప్పుడే నిజమైన నాయకుడు అవుతారని వారు చెప్పుకొచ్చారు.

    English summary
    Manchu Manoj to visit a 6-year-old girl's family who died after rape in Hyderabad, as per sources he is also helping them financially.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X