twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేవలం మనకోసమే, వారిని గౌరవించండి.. మంచు మనోజ్ ట్వీట్ వైరల్

    |

    కరోనా వైరస్ ఎంతటి బీభత్సాన్ని సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ కుదేలవుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్యంలో అత్యధిక కరోనా బాధితులుగా ఉండటంతో అతలాకుతల అవుతోంది. మన దేశంలోనూ కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా కట్టడికి చేపట్టిన లాక్ డౌన్ చర్య కొద్దిమేర సఫలీకృతమైనట్టు కనిపిస్తోంది.

    ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాలని, ఏప్రిల్ 14 వరకు ఎవ్వరూ రోడ్డు మీదకు రాకూడదని లాక్ డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. అయితే కొంత మంది లాక్ డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించడం అలాంటి చోట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో సమాజంలో పోలీసులను వ్యతిరేకించేవారు కొందరు ఉంటే.. ఆ చర్యలను సమర్థించే వారు మరికొందరు ఉంటారు.

    Manchu Manoj Tweet ABout Police Service In Lockdown

    ఇలాంటి విపత్కర సమయాల్లో పోలీసులు చేస్తోన్న త్యాగం, వారి సేవలను ప్రతిబింబించేలా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన సమాజం పోలీసుల సేవలను కొనియాడుతోంది. అందుకు నిదర్శనంగా ఓ ఫోటో నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది. నడిరోడ్డు మీద ఒంటరిగా కూర్చుని అన్నం తింటోన్న ఫోటో ఒకటి, దాని పక్కనే ఫ్యామిలీతో కూర్చుని తింటోన్న ఫోటో ఒకటి తెగ హల్చల్ చేస్తోంది. ఈ ఫోటోను మంచు మనోజ్ పోస్ట్ చేస్తూ.. కేవలం మనం మన ఇంట్లో క్షేమంగా ఉండాలని.. వారు వారి ప్రియమైన వారికి దూరంగా ఉంటూ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.. వారిని గౌరవించండి.. వారిని సపోర్ట్ చేయండని వేడుకొన్నాడు.

    English summary
    Manchu Manoj Tweet ABout Police Service In Lockdown. MAnchu Manoj Request To The People That Pls Respect And Support Police.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X