Manchu Manojకు సూపర్బ్ బర్త్ డే గిఫ్ట్.. క్రేజీగా 'వాట్ ది ఫిష్' గ్లింప్స్.. గతంలో చూడనివిధంగా మనోజ్!
మంచు మనోజ్ బడా సినీ కుటుంబం బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనదైన మేనరిజం, స్టైల్, నటనతో ఆకట్టుకున్నాడు. దొంగ దొంగది సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు మనోజ్ పలు డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లి తర్వాత వరుసగా సినిమాలు చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మనోజ్ నటించిన వాట్ ది ఫిష్ (What The Fish) మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. సీనియర్ ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నాదేశం, అడవిలో అన్న, ఖైదీగారు వంటి సినిమాల్లో అలరించాడు. చాలా కాలం తర్వాత హీరోగా దొంగ దొంగది సినిమాతో డెబ్యూ చేసి శ్రీ, రాజు భాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, కరెంట్ తీగ, పాండవులు పాండవులు తుమ్మెద, పోటుగాడు, ఎటాక్, గుంటూరోడు లవ్ లో పడ్డాడు, ఒక్కడు మిగిలాడు వంటి చిత్రాలతో ఎంటర్టైన్ చేశాడు.

సినిమాలకు చాలా కాలం గ్యాప్ ఇచ్చిన మంచు మనోజ్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం వాట్ ది ఫిష్ . తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా వాటి ది ఫిష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ (What The Fish First Look Glimpse) విడుదల చేశారు. ఈ వీడియోలో మనోజ్ గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో దర్శనం ఇచ్చి ఆకట్టుకున్నాడు. టెక్నో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్నట్లుగా ఈ గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. రోబోలా చేస్తూ, రా, గ్రిట్, గన్స్ బ్లేజింగ్, మనీ ఫ్లో, స్టేయింగ్ ట్రూ అంటూ తదితర అంశాలను చూపించారు.
ఇక వాట్ ది ఫిష్ ఫస్ట్ లుక్ లో మనోజ్ చేత పాడించిన గీతం డిఫరెంట్ గా ఉండి క్యూరియాసిటీ పెంచేస్తుంది. బీజీఎమ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు వరుణ్ తెరకెక్కిస్తున్నారు. మూవీ షూటింగ్ ను టొరంటో, కెనడాలోని పలు ప్రాంతాల్లో చేశారట. 6ix సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విడుదల తేదిని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. డార్క్ కామెడీ, హై ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మూవీ రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











