Manchu Mohan Babu మాస్ వార్నింగ్.. రాజకీయంగా తన పేరు వాడుకుంటే అలా చేస్తారట!

నట ప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ చరిత్రలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన.. 90వ దశకంలో పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, అల్లుడుగారు, అల్లరి మొగుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ ఆ తర్వాత ట్రెండ్ ను అందిపుచ్చుకోలేక వరుసగా అపజయాల పాలయ్యాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న తాజాగా తన పేరు రాజకీయంగా వాడుకుంటున్న వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మంచు మోహన్ బాబు సినిమాలతో పాటు గతంలో రాజకీయకాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఆయన పేరును రాజకీయంగా పలువురు వాడుకుంటున్నారనే విషయం ఆయనకు తెలిసి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరు ప్రస్తావిస్తే ఏం చేస్తారో కూడా ప్రకటించారు.

Manchu Mohan Babu Mass Warning to Those Who Are Using His Name Politically Check Details

మంచు మోహన్ బాబు ఎక్స్ వేధికగా... విజ్ఞప్తి అంటూ ఓ లేఖను రాసుకొచ్చారు. "ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించు కుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం."

"చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానంటూ" లేఖలో రాసుకొచ్చారు.

Manchu Mohan Babu Mass Warning to Those Who Are Using His Name Politically Check Details

మంచు మోహన్ బాబు షేర్ చేసిన ఈ లేఖను చూసిన ప్రతీ ఒక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. రాజకీయాల్లో నువ్వో ఓ జీరోవి.. మళ్లీ నీపేరు ఇంకొకరు వాడుకోవడం ఏంటంటూ కొందరు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ పేరు కూడా త్యాగం చేయలేరా సార్ అంటూ మరొకరు కామెంట్లు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X