మెగాస్టార్ కోసం మోహన్ బాబు మొదటి గిఫ్ట్.. హార్లీ డేవిడ్‌సన్ బైక్ లాంటిదే కానీ..
మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు మధ్య సాన్నిహిత్యం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. పలుమార్లు వారి మధ్య వివాధాలు నడిచాయని రూమర్స్ వచ్చినప్పటికీ ఆ తరువాత కొన్ని సందర్భాల్లో తామిద్దరం మంచి మిత్రులమని వివరణ ఇచ్చి రూమర్స్ కి చెక్ పెట్టారు. ఇక శనివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మంచు మోహన్ బాబు ఎవరు ఊహించని విధంగా ఒక బహుమతి అందించారు.

హార్లీ డేవిడ్‌సన్ డిజైన్
హార్లీ డేవిడ్‌సన్ డిజైన్ గల ఒక కళాత్మకమైన బైక్ ని కానుకగా ఇచ్చారు. పూర్తిగా చెక్కతో డిజైన్ చేసిన ఆ ఆకృతి మెగాస్టార్ కి కూడా చాలానే నచ్చింది. అందుకు మెగాస్టార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఫోటోను కూడా షేర్ చేశాడు. నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి.. అంటూ మెగాస్టార్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

చిరంజీవి నాకు మంచి మిత్రుడు
నిన్న పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు ఈ విధంగా ట్వీట్ చేశారు. 'చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్' అని పేర్కొన్నారు.

వ్యక్తిగత విబేధాలు లేవని
గతంలో జరిగిన మా కమిటీ మీటింగ్ లో చిరంజీవిపై రాజశేఖర్ వివాదస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు మోహన్ బాబు చిరంజీవికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. తమ మధ్య ఎన్నడు కూడా వ్యక్తిగత విబేధాలు లేవని మరోసారి మోహన్ బాబు నిరూపించారు. ప్రస్తుతం మెగాస్టార్ పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recommended Video

ఆచార్య మోషన్ పోస్టర్ వైరల్
ఇక నిన్న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆచార్య సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ లుక్ పై అభిమానులతో పాటు స్టార్ హీరోలు కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











