నాగబాబుపై మంచు విష్ణు ఊహించని కామెంట్స్.. 'స్నేక్' బ్యాచ్ అంటూ!
మంచు వారి అబ్బాయిగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు మంచు విష్ణు. ప్రస్తుతం హీరోగా, మా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపడుతున్నాడు. ఇటీవల వచ్చే మా ఎన్నికల్లో పోటీ చేయను అని నిర్ణయం తీసుకుని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా 'భక్త కన్నప్ప' (Bhaktha Kannappa) సినిమాను ప్రారంభించారు. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగబాబుపై ఊహించని కామెంట్స్ చేశాడు మంచు విష్ణు. అలాగే ప్రభాస్, మహేశ్ బాబును లాగుతూ మాట్లాడాడు. ఇంతకీ మంచు విష్ణు ఏం మాట్లాడాడనే విషయంలోకి వెళితే..
అప్పుడు సహించలేదు : మంచు విష్ణు తాజాగా జాఫర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రోలింగ్ పై మాట్లాడాడు. "ట్రోలింగ్ ను నేను పెద్దగా పట్టించుకోను. నన్నే కాదు నాలా చాలా మందిని ట్రోల్ చేస్తుంటారు. అందరిపైనా దుర్భాషలు మాట్లాడుతూ ట్రోలింగ్ కు పాల్పడుతుంటారు. కానీ కొన్నిసార్లు మితిమీరినప్పుడు మాత్రం సహించలేదు" అని జాఫర్ తో మంచు విష్ణు తెలిపాడు.

మహేశ్ బాబుకు కావట్లేదా : "జెన్యూన్ గా నాపై ఎవరైనా సెటైర్స్ వేస్తే ఎంజాయ్ చేస్తాను. కానీ, కొన్ని పెయిడ్ బ్యాచ్ లు ఉంటాయి. పని కట్టుకుని డబ్బులిచ్చి మరీ ట్రోల్ చేయిస్తున్నారు. అయితే ట్రోలింగ్ అనేది ఎవరికీ అవ్వడం లేదు. ప్రభాస్ కు అవ్వడం లేదా?. మహేశ్ బాబుకి అవ్వడం లేదా? తారక్ కు అవ్వడం లేదా? అందర్నీ ట్రోల్ చేస్తున్నారు" అని మంచు విష్ణు అన్నాడు.

హమ్మో.. నాగబాబు : "మా ఎలక్షన్స్ ముందు వరకూ నాపై ట్రోలింగ్ ఉండేది కాదు. ఎలక్షన్స్ అప్పుడే నాపై ట్రోలింగ్ జరిగింది. అది ఎవరు చేయించారో అందరికీ తెలుసు. ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడు ఎందుకులే" అని మంచు విష్ణు అన్నారు. దీంతో "హమ్మో.. మీరు నాగబాబు గారి గురించే కదా అన్నారు" అని జర్నలిస్ట్ జాఫర్ తిరిగి మంచు విష్ణును ప్రశ్నించారు.

అంత టైమ్ ఉండదు : "ఇప్పుడు ఆ పెద్దాయన గురించి ఎందుకు? ఆ పేరు నేను తీయలేదు. ఆయన లైఫ్ ఆయన లీడ్ చేస్తున్నారు. నా జీవితం నేను చూసుకుంటున్నాను. వాళ్లు నాకంటే పెద్దవాళ్లు. వాళ్ల ముందే పుట్టి పెరిగా. వాళ్లను ఎందుకు అంటా. మా ఎన్నికల తర్వాత కూడా మేం కలవడానికి సరైనా అవకాశం రాలేదు. వస్తే తప్పకుండా కలిసేవాళ్లం. మా మధ్య గొడవలు అవీ ఇవీ అంటారు. కానీ, మాకు అంత టైమ్ ఉండదు. ఎవరి పని వాళ్లం చేసుకుంటున్నాం" అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

మరికొన్ని నెలల్లో : అయితే మా ఎన్నికల సమయంలో మంచు వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్లుగా గట్టి పోటి నడిచిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలిచి మా అధ్యక్షడిగా గెలిచారు. మరికొన్ని నెలల్లో మంచు విష్ణు అధ్యక్ష పదవి ముగియనుంది. మా ఎన్నికల తర్వాత మంచు విష్ణుపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగింది.

స్నేక్ బాబు అంటూ : తనపై, తన కుటుంబంపై ట్రోలింగ్ చేయిస్తుంది ఎవరో ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసని నాగబాబుపై పరోక్షంగా విమర్శలు చేశాడు మంచు విష్ణు. ట్రోలింగ్ చేసేవారిపై కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఇక నాగబాబు హేటర్స్ ఆయన్ను స్నేక్ బాబు అని అంటుంటారని టాక్. గతంలో నటి శ్రీరెడ్డి సైతం నాగబాబును స్నేక్ బాబు అంటూ పరోక్షంగా అనేక పోస్టులు పెట్టింది.


Click it and Unblock the Notifications











