మోసగాళ్లు టీం సందడి.. విష్ణు, నవదీప్ హల్చల్
మంచు విష్ణు ప్రస్తుతం మోసగాళ్లు ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. మొదటి సారిగా ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ ప్రాజెక్ట్‌ను రెడీ చేశాడు. మామూలుగా అయితే అంతర్జాతీయ స్థాయితో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇంగ్లీష్ భాషలో ఈ మూవీ రావడానికి కాస్త ఆలస్యమయ్యేలా ఉందని చెప్పుకొచ్చారు.అయితే ఇండియాలో మోసగాళ్లు వివిధ భాషల్లో రాబోతోంది. కానీ తెలుగులో మాత్రమే మోసగాళ్లు టైటిల్‌తొ రాబోతోంది.
హింది, తమిళం, కన్నడం, మళయాలంలో మాత్రం అను అండ్ అర్జున్ అనే టైటిల్‌తో రాబోతోంది. అయితే ఇప్పుడు మోసగాళ్లు టీం సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో ఓ కాంటెస్ట్ పెట్టారు. మీ క్రైమ్ పార్ట్నర్ ఎవరు? అంటూ ఓ కాంటెస్టె పెట్టారు.. అందులో గెలిచిన వారికి తమతో కలిసి సినిమా విడుదల కంటే ముందే ఓ స్నీక్ పీక్‌ను చూసే అవకాశాన్ని ఇస్తామని తెలిపారు.

అలా నేడు ఈ మూవీ టీం వైజాగ్‌లో సందడి చేసింది. పనిలో పనిగా వైజాగ్‌లో సింహాచలం నర్సింహా స్వామి దేవాలయాన్ని సందర్శించింది చిత్రయూనిట్. మంచు విష్ణు, నవదీప్ ఇద్దరూ కూడా దైవ దర్శనం చేసుకున్నారు. ఇక రేపు మళ్లీ ఇదే కాంటెస్ట్‌ను హైద్రాబాద్‌లో నిర్వహించబోతోన్నారు. మొత్తానికి మోసగాళ్లు టీం మాత్రం మంచిగా ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











