‘న్యూయార్క్ అకాడమీ’ అనౌన్స్ చేసిన మంచు విష్ణు
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు సినిమాల కంటే తమ కుటుంబం నిర్వహిస్తున్న విద్యాసంస్థల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన 'న్యూయార్క్ అకాడమీ' అనే కొత్త ఎడ్యుకేషనల్ క్యాంపస్ అనౌన్స్ చేశారు. హైదరాబాద్ సమీపంలోని తెల్లాపూర్లో దీన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఈ క్యాంపస్‌లో రెండు పోగ్రెసివ్ స్కూల్స్ ఉంటాయని, 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 2020 నుంచి ఇది విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద స్కూల్ క్యాంపస్‌లలో ఇదీ ఒకటిగా చెబుతున్నారు.
మంచు విష్ణు సినిమాల విషయానికొస్తే... ఆయన హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా 'ఓటర్' చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఎన్నికల తర్వాత ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. రమా రీల్స్ బ్యానర్‌పై జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు.

దీనితో పాటు తనకు 'ఢీ' లాంటి హిట్ అందించిన శ్రీనువైట్లతో మంచు విష్ణు సినిమా చేయబోతున్నారు. ఇటీవల తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంచు విష్ణు ఈ ప్రకటన చేశాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











